Production workers
-
Comedian Ali : కష్టకాలంలో వారికి అండగా నటుడు అలీ
లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్, నటుడు అలీ వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన భార్య జుబేదాతో కలిసి ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన 130 మంది మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. పదికిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెర సహా 8 రకాలైన సరుకులను వారికి అందజేశారు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ..ప్రతి రోజు ఈ మహిళా కార్మికులు మా కంటే ముందే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు. ప్లేట్లు, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు లేక పని దొరక్క వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. అందుకే నా వంతుగా చిన్న సహాయం చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు, నటుడు ఖయ్యూం సహా తదితరులు పాల్గొన్నారు. చదవండి : బ్రదర్స్ డే : అరుదైన ఫోటోను షేర్ చేసిన చిరంజీవి వాళ్లు నాకు ఎప్పటికీ ఫోన్ చేయరు: సోనూసూద్ భావోద్వేగం -
వారసత్వ ఉద్యోగాలంటూ మోసం
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజం ⇒ చెల్లని జీఓ జారీ చేయడమే కాకుండా కోర్టులో కేసు వేయించారు ⇒ ఆ నిందను మాపై మోపి రాజకీయ లబ్ధికి ప్రయత్నించారు ⇒ చిత్తశుద్ధి ఉంటే సింగరేణి కార్మికులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల తర్వాత చెల్లని జీఓ ఇవ్వడమే కాకుండా కోర్టులో కేసు వేయించి కార్మికులను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, మోసమే టీఆర్ఎస్ విధానమని మండిప డ్డారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి. కుంతియాతో కలసి శుక్రవారం గాంధీభవన్ లో ఉత్తమ్ సమావేశమయ్యారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయం లో టీఆర్ఎస్ చేసిన మోసం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణపై ద్రోహం, సింగరేణి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, సింగరేణి కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీ చైర్మన్ గండ్ర వెంకట రమణారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తే టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న వారితోనే కోర్టులో కేసును ఎందుకు వేయించారని ప్రశ్నించారు. ఈ జీఓ చెల్లదని కేసీఆర్‌కు తెలిసినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని, తద్వారా వారసత్వ ఉద్యోగాలకు అర్హులైన 16 వేల మందిని కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతలను కోర్టుకు పంపి ఆ నిందను కాంగ్రెస్‌పై మోపి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని ఉమాండ్ చేశారు. ఇచ్చిన హామీకీ దిక్కులేదు... సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రస్తుతం అందులో ఒక్క కాంట్రాక్టు కార్మికుడూ లేరని బుకాయిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీకీ మూడేళ్లుగా దిక్కులేద న్నారు. ఓపెన్‌కాస్టు గనులను మూసేయిస్తా మని చెప్పి కొత్తగా 16 ఓపెన్‌కాస్టు గనులకు అనుమతిచ్చారని విమర్శించారు. -
ఇగో టీ.. ఇనాం..
కార్మికులకు తెలంగాణ కానుక ఈ నెల వేతనాలతో ఇంక్రిమెంట్ బేసిక్‌పై 3 శాతం స్పెషల్ పేమెంట్ సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం కొత్తగూడెం(ఖమ్మం) : మూడు నెలలుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ఎట్టకేలకు యాజమాన్యం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్‌కుమార్ సర్క్యులర్‌ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా స్పెషల్ ఇంక్రిమెంట్‌ను కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూఏ కార్మికులు, ఎగ్జిక్యూటివ్ ర్యాంకు కార్మికులకు 3 శాతం ఇంక్రిమెంట్ అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల వేతనాల తోపాటు ఈ ఇంక్రిమెంట్ అందనుంది. అయితే, ఇది పీఎఫ్, డీఏ, పెన్షన్లకు వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీ కవితకు కృతజ్ఞతలు శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : తెలంగాణ ఇంక్రిమెంటుకు యాజమా న్యం అంగీకరించడంతో గుర్తింపు సంఘం నాయకులు.. యూని యన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వ కుంట్ల కవితను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరా జు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, డాక్టర్ శం కర్నాయక్ ఎంపీని గురువారం కలిసి.. ఇంక్రిమెంటు విషయమై మాట్లాడినట్లు ఉపాధ్యక్షుడు ఏనుగు రవీం దర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఎంపీ వెంటనే సింగరేణి సీఎం డీతో చర్చించారని, అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యా యని విలేకరులతో రవీందర్‌రెడ్డి చెప్పారు. సింగరేణిలో పని చేస్తున్న 62వేల మందికి ఈ ఇంక్రిమెంటు వర్తిస్తుం దని పేర్కొన్నారు. కాగా, ఈ ఇంక్రిమెంటుతో కంపెనీపై ప్రతీ నెల సుమారు రూ.5.31కోట్ల భారం పడనుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. యాజమాన్యం నిర్ణ యంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.