
ప్రొ.జయశంకర్ విగ్రహావిష్కరణ
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లోని నాన్ టీచింగ్ హోంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని టీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లేష్‌తో పాటు ఉద్యోగ సంఘాల నేతలు పార్థసారథి, మల్లేష్, జ్ఞానేశ్వర్, అవినాష్, దీపక్‌కుమార్, మహమూద్, అక్బర్‌బేగ్, ఓం ప్రకాష్, ఖాజమోహినుద్దీన్, ఎల్లమయ్య, భూమారావు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్‌ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ఈద్ మీలాఫ్ ఉత్సవాలను నిర్వహించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ అమరుల కుటుంబాల కోసం ఓయూ ఉద్యోగులు సేకరించిన రూ.14.50 లక్షల చెక్‌ను టీఎన్జీఓస్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కు వారు అందించారు.
విద్యార్థుల ఆందోళన
ఓయూలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు వస్తున్నారని తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రులను అడ్డునేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని పది మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారిని లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.