మిషన్ భగీరథ’ పనులు వేగవంతం చేయూలి
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పనులు కొ న్నిచోట్ల నత్తనడకన సాగడంపై కలెక్టర్ వాకాటి కరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమన్వయం తో సమస్యలు పరిష్కరించుకుంటూ పనులు వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాల యంలో వాటర్‌గ్రిడ్ ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు, నాగార్జున నిర్మాణ సంస్థ ప్రతిని ధులతో సమీక్ష నిర్వహించారు. మెట్రో సెగ్మెంట్ కింద జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 704 ఆవాసాలకు ఏప్రిల్ 30 నాటికి తాగునీరు అంది చేలా పనులు చేపట్టాలన్నారు.
25 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా ప్రగతిలో 9, భూసమస్య కారణంగా 6, రోడ్డు సమస్య కారణంగా 4 నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని, అధికారులు అలసత్వం వహించకుండా సత్వర చర్యలు చేపట్టాలని చెప్పారు. రెవెన్యూ అధికారులు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీ లించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ ఏసురత్నం, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు, జనగామ ఆర్డీవో వెంకటరెడ్డి, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.