చేతలు గోరంతే! | Gormley steroids! | Sakshi
Sakshi News home page

చేతలు గోరంతే!

Published Mon, Feb 3 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM

Gormley steroids!

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలును రాష్ట్ర ప్రభుత్వం గాలికొది లేసింది. ఇలాంటి బిల్లు దేశంలో మరెక్కడా లేదని సొంత డబ్బా కొట్టుకున్న పాలకులు దీనిగురించి పట్టించుకోవడమే మానేశారు. నిధులూ పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. అభివృద్ధి పనులకు సూచించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. దళితుల బతుకులు పుట్టెడు సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.         
 
పలమనేరు, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీల భద్రత, సామాజిక హోదా, సమానత్వం, ఆర్థిక ఎదుగుదల, విద్య, మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం గా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2012-13లో ఉప ప్రణాళిక కోసం రూ.10,500 కోట్లు కేటాయించింది. ఎస్సీలకు రూ.8వేల కోట్లు, ఎస్టీలకు రూ.2500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు సంబంధించి సుమారు రూ.60 కోట్ల దాకా నిధులను కేటాయించినట్లు స్వయానా ముఖ్యమంత్రే వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం ఈ నిధులను ఖర్చుచేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ నిధులు పూర్తిస్థాయిలో విడుదలకాలేదు.
 
ఉద్దేశం సరే .. ఆచరణేదీ
 
ఈ సబ్‌ప్లాన్ ద్వారా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఐకేపీ మహిళలకు బ్యాంక్ లింకేజీ, ప్రత్యేక బ్యాంకు నిధి, ఎన్‌ఆర్ ఈజీఎస్, ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు, మరుగుదొడ్లు, ఇందిరజల ప్రభ ద్వారా భూముల అభివృద్ధి, కులాంతర  వివాహాలకు ప్రోత్సాహకం పెంపు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు, సమగ్ర వసతి గృహ సంక్షేమ భవన సముదాయాల నిర్మాణం, హాస్టల్ భవనాలకు మరమ్మతులు తదితరాలను చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు 46 శాతం నిధులు మంజూరు కావడంతో వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు నెరవేరలేదు.  
 
జిల్లాలో ఏం జరిగిందంటే

 
సంబంధిత శాఖల ద్వారా సబ్‌ప్లాన్ నిధులను కేటాయించి ఎస్సీ, ఎస్టీలకు అవసరమైన పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఆవాసాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యం కల్పించారు. సంబంధిత మండలాల్లోని ఎంపీడీవోలు ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న గ్రామాలు, ఆవాసాలను గుర్తించా రు. అయితే జిల్లాలోని ఏ మండలానికీ ఇంతవరకు నిధులు అందలేదు. ఫలితం గా ఈ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలు ఉన్న స్లమ్ ఏరియాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.5 కోట్లదాకా మంజూరైంది.

ప్రతిపాదనలు సైతం కమిషనర్లు సిద్ధం చేశారు. అయితే నిధులందక పనులు కొండెక్కాయి. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మొన్న జరిగిన రచ్చబండలో 50 యూనిట్లలోపు కరెంటు చార్జీలు చెల్లించే కార్యక్రమంలో భాగంగా రూ.1.59 కోట్ల బకాయిలను ట్రాన్స్‌కోకు చెల్లించారు. ఇదికూడా మూ డు నెలలకు సంబంధించింది మాత్రమే. వివిధ శాఖలకు చెందిన పర్యవేక్షణలు, వీటిపై బాధ్యతను జీవో నంబర్ 34 ప్రకారం ఈ మధ్యనే ఎస్సీ కార్పొరేషన్ కు అప్పగించారు. మంజూై రెన నిధుల్లో ఎస్సీలకు ఆరు శాతం, ఎస్టీలకు మూడు శాతం నిధులు ఖర్చు చేశారు. మిగిలిన నిధులు అలాగే మురు గుతున్నాయి.  
 
అన్నీ సమస్యలే
 జిల్లాలో సుమారు 18.02 శాతం మంది ఎస్సీ, ఎస్టీలున్నారు. 484 గ్రామాల్లో వీ రు అధికంగా ఉన్నట్టు అధికారులు గు ర్తించారు. మున్సిపాలిటీల్లో 70 వార్డుల ను ఎంపిక చేశారు. కానీ ఈ పథకంలో నిధులు వీరికి పూర్తి స్థాయిలో ఇంతవరకు అందనే లేదు. ఈ విషయమై చిత్తూ రు సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూ టీ డెరైక్టర్ ధనంజయరావ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. తమ శాఖ ద్వారా 50 యూనిట్లలోపు ఉన్న లబ్ధిదారులకు రూ.1.59 కోట్లను చెల్లించామన్నారు. మి గిలిన నిధులు ఈ నెల 15 లోపు ఖర్చుచేయాలని కలెక్టర్ ఆదేశించినట్టు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement