కొత్త యూనివర్సిటీలకు తీరని నష్టం
కొత్త యూనివర్సిటీలకు తీరని నష్టం
రాష్ట్ర ప్రభుత్వం కన్ను వర్సిటీల నిధులపై పడింది. ఈ నేపథ్యంలో వ ర్సిటీల అభివృద్ధికి దోహదపడే అంతర్గత నిధులను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ముందడుగు వేసింది. ఇం దులో భాగ ంగా సంబంధిత ఆదేశాలు కూడా విడుదలయ్యారుు . అరుుతే జిల్లాలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి ఇంకా ఈ ఆదేశాలు అందాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే...
ఎచ్చెర్ల క్యాంపస్ : యూనివర్సిటీలు ఆర్థిక పరిపుష్టి కావాలంటే ప్రభుత్వం ప్రత్యేక నిధులను వర్సిటీలకు అందజేయాలి. బడ్జెట్‌లో మెరుగైన కేటారుుంపులు చేయాలి. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ. రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆధార పడుతున్న సంస్థ. ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మూల ధన నిల్వలు ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేస్తుంది. అరుుతే వర్సిటీలకు అధికారికంగా ఆదేశాలు అందాల్సి ఉంది. యూనివర్సిటీలు అభివృద్ధిలో అంతర్గత నిధులదే కీలక పాత్ర. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేస్తుంటారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో అంతర్గత నిధులు కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సెల్, ఎగ్జామినేషన్‌స సెక్షన్ నుంచి ఎక్కువగా చేకూరుతున్నారుు. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ మూలధన చేకూర్పు పరిశీలిస్తే 86 డిగ్రీ కళాశాలలు ఉన్నారుు. 46,000 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ పరీక్ష ఫీజులు చెల్లిస్తారు. డిగ్రీ కళాశాలలు అడ్మిషన్ల సమయంలో ప్రత్యేక ఫీజులు, ఎఫిలియేషన్ , ర్యాటిఫికేషన్ ఫీజలు చెల్లిస్తారు. పీజీ అనుబంధ కళాశాలలు 10 వరకు ఉన్నారుు. వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలల్లో 1700 మంది వరకు విద్యార్థులు ఉన్నారు.
మరో పక్క బీఎడ్, ఎంఎడ్ కళాశాలలు ఉన్నారుు. ఈ కళాశాలల నుంచి విద్యార్థులు పరీక్ష ఫీజులు, ఎఫిలియేషన్ ఫీజులు ద్వారా మంచి ఆదాయం వస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి సంబంధించి ఏడాదికి రూ.4 కోట్లు వరకు ఆదాయం వస్తుంది. ఈ డబ్బును కరెంట్ అకౌంట్లు, మరో పక్క షార్టు టెర్మ్ ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తారు. వర్సిటీలో గతంలో పోల్చుకుంటే అంతర్గత నిధులు ద్వారా రూ.8 కోట్లతో అకడమిక్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. వసతిగృహానికి అదనపు వసతి నిర్మాణాలు, పరీక్షల నిర్వహణ, అదనపు భవనాల సముదాయం వంటి నిర్మాణాలు చేపట్టారు. ఇలా అనేక వసతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం మూలధన నిల్వలు ప్రభుత్వ అకౌంట్లులో జమ చేయాలి. ఈ నిధులు భవిష్యత్తులో ప్రభుత్వ వెనక్కు ఇస్తుందని సైతం చెప్పలేం. సొంతానికి, ప్రభుత్వ ఇతర పథకాలకు వినియోగించుకోవచ్చు. వర్సిటీలు అభివృద్ధి మాత్రం సాధ్యం కాదు.
ఎటువంటి ఆదేశాలు రాలేదు
ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు రాలేదు. వర్సిటీల మూ ల ధనం నిల్వలు ప్రభు త్వ ఖాతాల్లో జమ చేస్తే అభివృద్ధిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వర్సిటీలు స్వయం సమృద్ధి సాధన సైతం కష్టం. -ప్రొఫెసర్ తులసీరావు, రిజస్ట్రార్,డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ