- కేసీఆర్ ప్రభుత్వంపై టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి
- కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
సుబేదారి/హన్మకొండసిటీ : కేసీఆర్ ప్రభుతాన్ని తొడగొట్టి పడగొడతామని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కరెంటు లేక సాగు నీరందక రైతులు, పింఛన్లు అందక వృద్ధులు, ఇళ్ల బిల్లులు రాక పేదలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని అన్నారు.
రాష్ట్ర సాధన కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కేసీఆర్ 460 మందికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు. కవిత మ్మ బతుకమ్మ ఆడితే రూ.10కోట్లు ఇచ్చారు, సానియా మీర్జా కనపడినప్పుడల్లా రూ.కోటి ఇస్తున్నారు.. రైతుకు ఎకరానికి రూ. 30వేల నష్టపరిహారం ఇవ్వలేరా అన్ని ప్రశ్నించారు. టీడీపీలో ఒక్కొక్కరు 100 మంది కేసీఆర్‌లతో సమానం.. రాబోయే రోజుల్లో తొడగొట్టి ప్రభుత్నాన్ని పడగొడుతామని హెచ్చరించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని చెప్పా రు. రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహు లు మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ తన ఇంట్లోనే నాలుగు పదవులు ఇచ్చుకున్నాడని వివర్శించారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పు న ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశా రు.
రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ మూడేళ్ల వరకు కరెంట్ సమస్య తీరదనే సీఎం మాటలతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎంపీ నల్లమల్లారెడ్డి, పార్టీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ, రాష్ట్ర నాయకులు వేంనరేందర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడారు.
ధర్నా మధ్యలో పార్టీ ప్రతినిధుల బృందం జాయింట్ కలెక్టర్ పౌసుమిబసును క లిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం హన్మకొండలోని కాకతీయ హరిత హోటల్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కృష్ణారావు, రాజేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.