revantreddi
-
‘ఆ అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలైన పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమపై గెలుపొందినవారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల పిటిషన్లు(ఈపీ) దాఖలు చేశారు. ఈపీలు దాఖలు చేసినవారిలో నాగం జనార్దన్‌రెడ్డి, డీకే అరుణ, ఎ.రేవంత్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్, దాసోజు శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్, ఫిరోజ్‌ఖాన్, కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు. తమపై గెలుపొందిన వారంతా అక్రమ పద్ధతుల్లో విజయం సాధించారని తమ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. కొడంగల్‌లో తనపై గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నిక ల్లో అక్రమాలకు పాల్పడ్డాడని రేవంత్‌రెడ్డి తెలిపారు. అందువల్ల అతని ఎన్ని కను రద్దు చేసి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరారు. దర్మపురి నుంచి గెలుపొందిన కొప్పుల ఈశ్వర్ ఎన్నికను రద్దు చేయాలంటూ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తన పిటిషన్లో కోరారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నికను నాగం జనార్దన్‌రెడ్డి సవాలు చేశారు. గద్వాల నుంచి కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను డీకే అరుణ సవాలు చేశారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని దాసోజు శ్రవణ్ కోరారు. మహబూబ్‌నగర్‌లో వి.శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికను సవాలు చేస్తూ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్, నాంపల్లిలో ఎంఐఎం అభ్యర్థి ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్, సికింద్రాబాద్‌లో టి.పద్మారావుగౌడ్ ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హైకోర్టును ఆశ్రయించారు. -
లోక్‌సభపై కాంగ్రెస్ సీనియర్ల నజర్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సీని యర్లు సిద్ధమవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలతోపాటు మొద టి నుంచి పార్లమెంటుకు వెళ్లాలన్న ఆలోచనతో ఉన్న నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. సీఎల్పీ నేత హోదాలో పనిచేసిన సీనియర్ నేత జానారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి తదితరులు లోక్‌సభపై కన్నేశారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఫిబ్రవరిలోనే ప్రకటిస్తారనే అంచనాల నేపథ్యంలో ఆశావహ నేతలు అప్పుడే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమకు అనుకూలమైన అధిష్టానం పెద్దలను కలసి మనసులో మాట చెబుతున్నారని, అవకాశం ఇస్తే రాహుల్ నాయకత్వంలో లోక్‌సభలో పనిచేస్తామని వారిని ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్, పెద్దపల్లి స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటం గమనార్హం. నియోజకవర్గాలవారీగా... లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే నల్లగొండ నుంచి మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సై అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ వచ్చిన ఆయన తాను నల్లగొండ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కోమటిరెడ్డితోపాటు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి కూడా మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భువనగిరి స్థానం నుంచి నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ ఈ స్థానాన్ని ఆశిస్తున్న టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డితోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి పార్లమెంటరీ స్థానంపై గట్టి పట్టు ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి వంగాల స్వామిగౌడ్‌ను ప్రతిపాదిస్తున్నారు. బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతోపాటు స్వామిగౌడ్ స్థానికుడు కూడా కావడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన పటోళ్ల కార్తీక్‌రెడ్డితోపాటు కాసాని జ్ఞానేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. పాలమూరు పార్లమెంటు నుంచి సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేతలుగా గుర్తింపు పొందిన మాజీమంత్రి డి.కె.అరుణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం నుంచి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి రమేశ్ రాథోడ్, నరేశ్ జాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్, రవీంద్రనాయక్, బెల్లయ్యనాయక్, నాగర్‌కర్నూలు నుంచి నంది ఎల్లయ్య, మల్లు రవి, సంపత్, సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, బండ కార్తీకరెడ్డి, మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ, నిర్మలాజగ్గారెడ్డి, మల్కాజ్గిరి నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రేణుకాచౌదరి, వరంగల్ నుంచి మాజీ ఎంపీలు రాజయ్య, విజయరామారావులతోపాటు ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇందిర, నిజామాబాద్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, కరీంనగర్ నుంచి సీనియర్ నేత జీవన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ నుంచి సురేశ్‌షెట్కార్ పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ స్థానం నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను బరిలో దింపాలని అధిష్టానం భావిస్తు న్నా ఆయన సికింద్రాబాద్ స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, పెద్దపల్లిల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లలో ఎంతమంది ఆశలు ఫలిస్తాయో.. ఎవరు లోక్‌సభకు ఎన్నికవుతారో వేచిచూడాల్సిందే! నష్టాన్నిపూడ్చుకునేపనిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర పరాజయం పొందిందో అంతే ఘోర పరాభవాన్ని ఆ పార్టీ సీనియర్లు మూటకట్టుకున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె.అరుణ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 20 మంది సీనియర్ నేతలు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన రాజకీయనష్టాన్ని పూడ్చుకునేందుకు లోక్‌సభ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని చాలామంది సీనియర్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఓటమి పాలయ్యామనే సానుభూతి మరవకముందే లోక్‌సభ ఎన్నికలు వస్తుండటం, గతంలో ఉన్న ఛరిష్మా, సాధారణంగా జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో ఉండే సానుకూలతలు కలిసి వస్తాయనే అంచనాతో లోక్‌సభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
టీఆర్ఎస్ విజయానికే రేవంత్ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సాయం చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించారని ఆయన సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. చివరకు పోలీసుల సహకారంతో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా పరిగణించాలని, భవిష్యత్‌లో ఏ అధికారి కూడా ఇలా చేయకుండా కఠినంగా శిక్షించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ శిక్ష మిగిలిన పోలీసులకు ఓ పాఠం కావాలన్నారు. ప్రచారం ముగింపు ముందు రోజు రేవంత్‌ను పోలీసులు నిర్భంధించారని, దీని ఫలితంగా అతను ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. రేవంత్ నిర్భంధం వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని హైకోర్టుకు నివేదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి రేవంత్‌ని అక్రమంగా నిర్భంధించి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించిన నేపథ్యంలో నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం, రేవంత్ నిర్భంధం విషయంలో పోలీసుల తీరును తప్పుపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అప్పటి వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆమె కౌంటర్ దాఖలు చేయగా, దీనికి తిరుగు సమాధానం ఇవ్వాలని నరేందర్‌రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రేవంత్‌ది అక్రమ నిర్భంధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు జనవరి 22న విచారణ జరపనుంది. -
కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే
తమ్మినేని వీరభద్రం హైదరాబాద్: కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే సాగుతోందని, ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ కాకుండా బతుకు తెలంగాణ కోసం కృషి చేయాలని సూచించా రు. మహాజన పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్రలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలు చెబుతుంటే కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కావడంలేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ సామాజిక న్యాయం అందడం లేదన్నారు. వెనుకంజలో ఉన్న అన్ని కులాలవారికి విద్య, వైద్యం, ఉపాధి, ఇతర సౌకర్యాలు కల్పించి, అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. వాస్తు పేరుతో కొత్తగా ఉన్న భవనాలు కూల్చి ప్రజాధనాన్ని వృథా చేయొద్దని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. తమ్మినేనికి రేవంత్ ఫోన్ పాదయాత్రలో ఉన్న తమ్మినేనికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి శుక్రవారం ఫోన్ చేశారు. పాదయాత్ర జరుగుతున్న తీరును, ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 1న టీటీడీపీ అగ్రనేతలతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట వద్ద నుంచి పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నామన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సీపీఎం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. వేధింపులు ఆపండి: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న హోంగార్డులపై వేధింపులు ఆపాలని, నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీలతో చితకబాదడం గర్హనీయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, 2004కు ముందు విధుల్లో చేరిన వారికి అప్పటి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని శుక్రవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. -
ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా?: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలవల్ల నష్టపోయిన రైతాం గాన్ని ఆదుకోవాలని, ఆ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని కోరినందుకు ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీనేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నకిలీ విత్తనాలను సరఫరా చేసిన ఎన్ని కంపెనీలపై కేసులు పెట్టారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బంధువులకు చెందిన కావేరి కంపెనీ సహా 8 నకిలీ విత్తన కంపెనీలకు నోటీసులిచ్చిన అధికారిణిని సెలవుపై పంపి, కొత్త అధికారిని నియమించడం దుర్మార్గమన్నారు. మిషన్ భగీరథ కింద తాగునీరు అందించినందుకు ప్రజలవద్ద డబ్బులు వసూలు చేసేలా రుణ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. -
రేవంత్‌రెడ్డిపై ఆరోపణలెందుకు?: టీటీడీపీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రేవంత్‌రెడ్డి గుర్తుచేస్తే పొంగులేటి సుధాకర్‌రెడ్డి భుజాలెందుకు సర్దుకుంటున్నారని టీటీడీపీ ప్రశ్నించింది. కాంట్రాక్టర్లను రేవంత్‌రెడ్డి బెదిరిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. శనివారం ఆ పార్టీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు కోవర్ట్‌గా, కాంగ్రెస్‌లో ఉంటూ హరీశ్ చెప్పింది పొంగులేటి చేస్తున్నారని ఆరోపించారు. -
ఏకకాలంలో రెండు పదవులా?
కడియం శ్రీహరి మంత్రా.. ఎంపీనా?: టీడీపీ నేత రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరి.. ఎంపీ హోదాలో బుధవారం పార్లమెంటుకు హాజరై గ్రూపు ఫొటోలు దిగారని టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకే వ్యక్తి రెండు చట్టసభలకు ఏకకాలంలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారో.. నైతిక విలువల గురించి మాట్లాడే సీఎం కేసీఆర్‌కే తెలుసని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని టీడీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడా లేని విధంగా ఎంపీగా గెలిచిన వ్యక్తి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్లమెంటుకు హాజరుకావడం వింతగా ఉందన్నారు. కడియం శ్రీహరి మంత్రా, ఎంపీయా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనులు కూడా ముఖ్యమంత్రే చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. -
తొడగొట్టి పడగొడతాం..
కేసీఆర్ ప్రభుత్వంపై టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా సుబేదారి/హన్మకొండసిటీ : కేసీఆర్ ప్రభుతాన్ని తొడగొట్టి పడగొడతామని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కరెంటు లేక సాగు నీరందక రైతులు, పింఛన్లు అందక వృద్ధులు, ఇళ్ల బిల్లులు రాక పేదలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర సాధన కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కేసీఆర్ 460 మందికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు. కవిత మ్మ బతుకమ్మ ఆడితే రూ.10కోట్లు ఇచ్చారు, సానియా మీర్జా కనపడినప్పుడల్లా రూ.కోటి ఇస్తున్నారు.. రైతుకు ఎకరానికి రూ. 30వేల నష్టపరిహారం ఇవ్వలేరా అన్ని ప్రశ్నించారు. టీడీపీలో ఒక్కొక్కరు 100 మంది కేసీఆర్‌లతో సమానం.. రాబోయే రోజుల్లో తొడగొట్టి ప్రభుత్నాన్ని పడగొడుతామని హెచ్చరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని చెప్పా రు. రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహు లు మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ తన ఇంట్లోనే నాలుగు పదవులు ఇచ్చుకున్నాడని వివర్శించారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పు న ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశా రు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ మూడేళ్ల వరకు కరెంట్ సమస్య తీరదనే సీఎం మాటలతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎంపీ నల్లమల్లారెడ్డి, పార్టీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ, రాష్ట్ర నాయకులు వేంనరేందర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడారు. ధర్నా మధ్యలో పార్టీ ప్రతినిధుల బృందం జాయింట్ కలెక్టర్ పౌసుమిబసును క లిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం హన్మకొండలోని కాకతీయ హరిత హోటల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కృష్ణారావు, రాజేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.