- కడియం శ్రీహరి మంత్రా..
- ఎంపీనా?: టీడీపీ నేత రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరి.. ఎంపీ హోదాలో బుధవారం పార్లమెంటుకు హాజరై గ్రూపు ఫొటోలు దిగారని టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకే వ్యక్తి రెండు చట్టసభలకు ఏకకాలంలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారో.. నైతిక విలువల గురించి మాట్లాడే సీఎం కేసీఆర్‌కే తెలుసని ఎద్దేవా చేశారు.
గురువారం హైదరాబాద్‌లోని టీడీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడా లేని విధంగా ఎంపీగా గెలిచిన వ్యక్తి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్లమెంటుకు హాజరుకావడం వింతగా ఉందన్నారు. కడియం శ్రీహరి మంత్రా, ఎంపీయా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనులు కూడా ముఖ్యమంత్రే చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.