- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
- 33 మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి
మదనపల్లె: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రతియేటా మున్సిపల్ శాఖ నుంచి రెండు పర్యాయాలు 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది మార్చి 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 110 మున్సిపాలిటీలకు, 13 కార్పొరేషన్లకు నిధులను మంజూరు చేసింది. 77 మున్సిపాల్టీలలో ఈ నిధులను ఏప్రిల్ 5వ తేదీలోగా తీసుకున్నారు. మిగిలిన 33 మున్సిపాల్టీల్లో రూ.60 కోట్లకు పైగా నిధులను తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఈ కారణంగా వెనక్కి వెళ్లిపోయాయి. ఇందులో రాయలసీమ రీజనల్ పరిధిలో 9 మున్సిపాలి టీలు ఉండగా మన జిల్లాలో మూడు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీలోపు ఆయా పట్టణాల్లోని ట్రెజరీ కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వు కాపీలను సమర్పించి ఆ నిధులను మున్సిపల్ అకౌంట్‌కు బదలాయించి తీసుకోవాల్సి ఉంది. 33 మున్సిపాల్టీలలో అధికారుల పర్యవేక్షణ కొరవడం, చైర్మన్, పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఈ నిధులను సకాలంలో తీసుకోలేకపోయారు. ఆయా మున్సిపాలిటీల అధికారులు నిధులను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రూ.60కోట్ల నిధులు వెనక్కు
Published Wed, May 6 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement