Government funding
-
‘మెప్మా’ బినామీల దందా!
• చేతులు మారుతున్న ప్రభుత్వ నిధులు • రెండేసి బ్యాంకుల నుంచి రుణాలు.. • ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు • ఆధార్ అనుసంధానంతో 250 మంది పేర్ల తొలగింపు నర్సంపేట : నర్సంపేట నగర పంచాయతీ పరిధిలోని మురికివాడల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ద్వారా నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల్లో బినామీల దందా కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ని«ధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత నెల నుంచి ఆధార్ అనుసంధానం చేస్తుండడంతో 250 మంది పేర్లను కూడా తొలగించారు. అయితే, ఇప్పటికే పలువురు బినామీ పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు రెండు స్వయం సహాయ సంఘాల్లో పేర్లు నమోదు చేయించుకోని రుణాలు తీసుకున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది రుణాలను బ్యాంకులకు తిరిగి డబ్బులు చెల్లించడం లేదని చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ బ్యాంకుకు చెల్లించాల్సిన డబ్బును కాజేయడంతో సంఘంలోని సభ్యుల నడుమ గొడవ జరిగింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు.. మహిళా స్వయం సహాయక సంఘాల్లో అక్రమాలను నిర్మూలించేందుకు రాష్ట్రప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా సంఘాల్లోని బినామీలను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నర్సంపేట మెప్మా సంస్థకు చెందిన 699 స్వయం సహాయక సంఘాల్లో 7,280 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 1800 మంది వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయగా 250 మంది పేర్లు రెండు సంఘాల్లో నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో వారిని పేర్లను తొలగించారు. తద్వారా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చే స్వయం ఉపాధి రుణాలు పక్కదారి పట్టకుండా అర్హులకే అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పక్కదారి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయడానికి గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇందిరాక్రాంతి పథకం(ఐకేపీ) పేరును ఇప్పుడు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)గా మార్చారు. దీనిద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వ రుణాలు ఇస్తోంది. మహిళలు బృందాలుగా ఏర్పడి వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం కల్పించింది. నర్సంపేట పట్టణంలోని 20 వార్డుల్లో దాదాపు 40వేల మంది జనాభా ఉన్నారు. ఇందులో 699 స్వయం సహాయ సంఘాల్లో 7,280 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ఒక్కో గ్రూపులో ఐదుగురి నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఒక్కో స్వయం సహాయక సంఘం సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పిస్తోంది. ఈ రుణంతో కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటుచేసుకుని స్వయం ఉపాధి పొందాల్సి ఉంటుంది. ఇలా నగర పంచాయతీకి సంబంధించి ఐదు బ్యాంకుల నుంచి 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.4.50 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం విధించగా... మెప్మా అధికారులు 575 సంఘాలకు రూ.4 కోట్ల రుణాలు ఇప్పించారు. అయితే, రుణాలు పొందిన కొందరు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్టు రెండు గ్రూపుల్లో పేరు నమోదు చేసుకోని రెండుసార్లు బ్యాంక్ రుణాలు తీసుకోని తిరిగి చెల్లించడంలేదు. ఇంతకుముందు స్వయం సహాయక సంఘాల సభ్యులు అక్రమంగా రెండుచోట్ల రుణాలు తీసుకున్నా, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోయినా అధికారులు అంతగా పట్టించుకునే వారు కాదు. బ్యాంకు అధికారులు రెండు, మూడేళ్లకోసారి మారుతుండడంతో రుణాలు పొందిన మహిళా సంఘాల నుంచి బకాయిలు రికవరీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెబుతున్నారు. ఇలా కొన్నేళ్లుగా రూ.లక్షల్లో నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, నర్సంపేట నగర పంచాయతీ పరిధిలో బ్యాంక్ రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధార్ నంబర్లు అనుసంధానం చేయడంతో రెండు చోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. తద్వారా ఒక సభ్యురాలు నివాసం ఉండే చోటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని పరకాల, నర్సంపేట నగర పంచాయతీ సంఘాల్లోనూ çపూర్తిస్థాయిలో ఆధార్ అనుసంధానం చేస్తే అక్రమంగా రుణాలను పొందడాన్ని అరికట్టొచ్చని చెబుతున్నారు. -
నేను రాను బిడ్డో..సర్కార్ దవాఖానకు
ఓ సినీ కవి చెప్పినట్లు నర్సాపూర్‌లోని కమ్యూనిటీ ప్రభుత్వ ఆస్పత్రి తీరు తయారైంది. ఇక్కడ ఖరీదైన మందులు ఉన్నాయి.. కానీ వాటిని ఇచ్చేందుకు సూదులు(ఇంజెక్షన్లు) ఉండవు.. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు అంబులెన్స్ ఉంటుంది.. కానీ డీజిల్ ఉండదు.. పొరపాటున మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకువెళితే అందుకు అవసరమైన సామగ్రి మనమే తెచ్చుకోవాల్సిందే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి ఉంటే మరొకటి లేకపోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యం కోసం జేబులకు చిల్లులు పడుతుండడంతో సర్కార్ దవాఖాన అంటేనే ప్రజలు జంకుతున్నారు. - ఇంజక్షన్ చేయించుకోవాలంటే సూది తెచ్చుకోవాల్సిదే - అంబులెన్స్ కావాలంటే డీజిల్ పోసుకోవాలి - సామగ్రి కొనిస్తేనే పోస్టుమార్టం - ఇదీ..నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి ! నర్సాపూర్‌లోని కమ్యూనిటీ ప్రభుత్వ ఆస్పత్రిక రోజుకు మూడు నుంచి నాలుగు వందల మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఇన్పేషట్లు సరేసరి. నిత్యం రద్దీగా ఉండే ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులతో పాటు ఆస్పత్రి నిర్వహణ కోసం ఏడాదికి రూ.2.5లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇచ్చేందుకు మందులు ఉన్నప్పటికీ సూదులు(నిడిల్స్) ఉండవు. దీంతో రోగులో బ యట నుంచి సూదులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకు 200 ఇం జక్షన్ల చొప్పున లెక్క వేసుకున్నా నెలకు రూ.400 మించదు. అయినా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అనుమతి లేనిదే నిడిల్స్ కొనుగోలు చేయలేమని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపద కాలంలోనూ.. అన్నీ వ్యయాలే.. ఆపద కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు సైతం ఆర్థిక పరమైన వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను, క్షతగాత్రులను పెద్దాసుపత్రులకు తరలించాల్సి వస్తే అంబులెన్స్‌లో రోగుల సంబదీకులే డీజీల్ పోయిం చాల్సి వ స్తోంది. ఇదిలా ఉండగా ఎవరైనా చని పోయి పోస్టుమార్టం కోసం వస్తే పోస్టుమార్టం సమయం లో వినియోగించె ప్లాస్టిక్ కవర్, వైద్యు లు, సిబ్బంది వాడేం దుకు సబ్బులు, బ్లేడ్లు, గ్లౌజులు ఇతర సామగ్రి కూడా బాధితులే కొనివ్వాల్సి వస్తోంది. ఇక ఇబ్బందికి ఇచ్చే మా మూళ్లు సరేసరి. ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణకు నెలనెల లక్షల రూపాయలు ఖ ర్చు చేస్తున్న అధికారులు చిన్నచిన్న సామగ్రి సైతం అం దుబాటులో ఉంచకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని పేర్కొంటున్నారు. -
‘ఆరోగ్యం’లో అవినీతి!
- ఎన్హెచ్ఎం నిధుల వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ - డీఎంహెచ్ఓకు రిమైండర్ నోటీసు ఖమ్మం వైరారోడ్ : జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు ఉద్యోగులు ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరైన విచారణ చేపట్టకపోవటంతో వారి ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా జాతీయ ఆరోగ్యమిషన్‌లో రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కలెక్టర్ దృష్టికి వెళ్లటంతో ఆయన డీఎంహెచ్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా వివిధ పీహెచ్‌సీలకు ప్రతీ యేడాది రూ.కోట్లలో నిధులు వస్తుంటాయి. అయితే ఇటీవల ఉన్నతాధికారులు ఆడిటింగ్ చేయగా.. కోటి నిధులకు సంబంధించి లెక్క తేలలేదు. ఎన్హెచ్ఎం విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కీలకమైన అధికారి ఆ ఉద్యోగి ద్వారా నిధుల స్వాహా వ్యవహారానికి పాల్పడినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కలెక్టర్ ఇలంబరితి డీఎంహెచ్ఓకు రిమైండర్ నోటీసు ఇచ్చారు. వెంటనే ఎన్హెచ్ఎం నిధుల లెక్కలు చూస్తున్న ఔట్ సోర్సిం గ్ ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించి.. పర్మనెంట్ ఉద్యోగికి పూర్తిసాయి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఎన్హెచ్ఎంకు నిధులు ఇప్పటివరకు ఎన్ని విడుదలయ్యాయి? ఎంత ఖర్చు చేశారు? మిగిలిన నిధులు ఎన్ని? అనే విషయూలపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినుట్ల తెలిసింది. దీనికి తోడు 104లో నిధుల దుర్వినియోగంపై కూడా కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. రెండేళ్లలో 104 వాహనాల రిపేర్లు, టైర్లు, ఇతర వస్తువుల కొనుగోలు, ఖర్చులకు రూ.కోట్లలో నిధులు మంజూరయ్యాయి. వీటిలో కూడా భారీగానే అవినీతి జరిగినట్లు తేల్చారు. 104లో కూడా రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో కూడా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరగా విచారణ చేసి.. నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. -
రూ.60కోట్ల నిధులు వెనక్కు
- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం - 33 మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి మదనపల్లె: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రతియేటా మున్సిపల్ శాఖ నుంచి రెండు పర్యాయాలు 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది మార్చి 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 110 మున్సిపాలిటీలకు, 13 కార్పొరేషన్లకు నిధులను మంజూరు చేసింది. 77 మున్సిపాల్టీలలో ఈ నిధులను ఏప్రిల్ 5వ తేదీలోగా తీసుకున్నారు. మిగిలిన 33 మున్సిపాల్టీల్లో రూ.60 కోట్లకు పైగా నిధులను తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా వెనక్కి వెళ్లిపోయాయి. ఇందులో రాయలసీమ రీజనల్ పరిధిలో 9 మున్సిపాలి టీలు ఉండగా మన జిల్లాలో మూడు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీలోపు ఆయా పట్టణాల్లోని ట్రెజరీ కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వు కాపీలను సమర్పించి ఆ నిధులను మున్సిపల్ అకౌంట్‌కు బదలాయించి తీసుకోవాల్సి ఉంది. 33 మున్సిపాల్టీలలో అధికారుల పర్యవేక్షణ కొరవడం, చైర్మన్, పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఈ నిధులను సకాలంలో తీసుకోలేకపోయారు. ఆయా మున్సిపాలిటీల అధికారులు నిధులను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
రద్దు చేస్తారా.. ఆదరిస్తారా?
తీవ్ర ఆవేదనలో 9 లక్షల మంది ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: అధికారికంగా ఇళ్లు మంజూరయ్యాయి.. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. ఒక్క ఇటుక కూడా పడలేదు.. ఇదంతా ఎన్నికలకు ముందటి ముచ్చట. కానీ అధికారుల లెక్కల ప్రకారం వారంతా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులే...! ఇంతలో కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో అక్రమాల వెలికితీత పేరుతో పాత పథకానికి నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ లబ్ధిదారులంతా.. ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభించనందున తమను కొత్త పథకంలోకైనా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ సర్కారు నుంచి స్పష్టత కరువైంది. దీంతో తాము రూ.75 వేల యూనిట్ కాస్ట్ ఉన్న పాత పథకానికే పరిమితమవుతామా లేక రూ.3.50 లక్షలున్న కొత్త పథకంలోకి మారతామా అన్నది వారికి అంతు చిక్కడంలేదు. దీంతో వారంతా తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 లక్షల కుటుంబాల వేదన ఇది. అయోమయం.. గందరగోళం.. పేదల గృహ నిర్మాణ పథకం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతుండడం తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణంలో గతంలో అక్రమాలు జరిగాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీఐడీ తో దర్యాప్తు చేయిస్తోంది. అది తేలిన తర్వాతే రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని వేగిరం చేయాలని భావి స్తోంది. కానీ ఆ దర్యాప్తు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించటం లేదు. దీంతో పేదల ఇళ్ల విషయంలో తీవ్ర అయోమయం నెల కొంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు ఏకంగా 13.65 లక్షల మం దికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్రం విడిపోవటంతో నిధులు విడుదల కాక ఆ ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దానికంటే ముందు కేటాయించినవి కూడా వివిధ కారణాలతో మొదలుకాలేదు. వెరసి తెలంగాణవ్యాప్తంగా 9 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని అధికారులు తాజాగా లెక్కతేల్చారు. అనుమతి వద్దు.. తర్వాత చూద్దాం! ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దంటూ జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే పనులు మొదలైన ఇళ్లకు మాత్రమే బిల్లులు విడుదల చేస్తామని అందులో స్పష్టంచేశారు. ప్రస్తుతం 4.69 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం రూ.147 కోట్లను విడుదల చేసేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు మొదలుపెట్టని 9 లక్షల ఇళ్లకు సంబంధించిన జాబితాను తాత్కాలికంగా పక్కనపెట్టారు. అయితే వాటిని అలాగే రద్దు చేస్తారా లేక కొత్త పథకంలోకి మారుస్తారా.. ఇందిరమ్మ పథకం కిందనే కొనసాగి స్తారా అన్న విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఆ తొమ్మిది లక్షల మందిని లబ్ధిదారులు కేటాయింపులను రద్దు చేసి రెండు పడక గదుల ఇళ్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిం చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
అధికారుల్లో గుబులు
పొలంబడి, స్వచ్ఛ భారత్‌పై అవగాహన కార్డులు, పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ మండలానికి రెండు బందాలు రోజుకో గ్రామంలో సమావేశం గామాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయలేదు. రోజుకో కొత్త బూటకపు హామీతో రోజులను నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. రేషన్‌సరుకులు ఇవ్వడం లేదు. దీనికి తోడు ఆధార్‌కార్డును అన్ని సంక్షేమ పథకాలు లింకు పెట్టి లబ్ధిదారుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. రేషన్‌కార్డుల నుంచి రుణమాఫీ వరకు అన్ని పథకాల్లోకు సవాలక్ష ఆంక్షలు పెడుతూ లబ్ధిదారులను కుదిస్తూ వస్తోంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈమేరకు జనం ఎక్కడ నిలదీస్తారోనన్న గుబులు అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రైతు, డ్వాక్రా రుణ మాఫీలకు సంబంధించి రైతులు, మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు రుణాలు రద్దు చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్నాక హామీలను నెరవేర్చకపోవడం, కనీసం కొత్త రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో గ్రామాలకు అధికారులు వెళ్లిన ప్రతీ సందర్భంలోను రుణమాఫీపై రైతులు నిలదీస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఆదర్శరైతు వ్యవస్థ రద్దుతో వారు ఉద్యమ బాట పట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తే రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీపై నిలదీస్తే ఏమి చెప్పాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
అభివృద్ధికి అధికారులకు గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వం నిధుల మంజూరు నిలిపేసింది. అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ ఆపేసింది. జిల్లా నాయక గణం ఉద్యోగుల బదిలీలపై దృష్టి సారించింది. తమకు నచ్చినోళ్లని తీసుకొచ్చేందుకు ప్రస్తుత ఉద్యోగులను సాగనంపే ప్రయత్నంలో పడింది. దీంతో ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది. అటు నిధుల్లేక, ఇటు బదిలీలపై టీడీపీ నేతలు చేస్తున్న హల్ చల్‌తో అధికారుల్లో ఆత్మస్థైర్యం సన్నగిలింది. దీంతో విధులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎంత చేసినా గుర్తింపు ఉండదన్న అభిప్రాయానికి వచ్చేశారు. దీంతో ప్రగతి కుంటుపడుతోంది. పం చాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ త దితర ఇంజి నీరింగ్ శాఖలకు నిధుల కొరత ఏర్పడింది. ఇప్పటికే మంజూరైన నిధుల వినియోగంపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రోడ్లు, మంచినీటి పథకా లు, కల్వర్టుల, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులకు గత ప్రభుత్వ హయాంలోనే కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. వీటితో కొన్ని పనులు ప్రారంభించగా, మరి కొన్ని పనుల టెండర్ల దశలో ఉన్నాయి. ఇంతలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు వాటిన్నిం టికీ బ్రేక్ వేశారు. ఎక్కడి పనులు అక్కడే నిలిపేయాలని, ప్రారంభించని పనులపై ముందుకెళ్లొద్దని పరో క్ష ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పూర్తయిన పనుల బి ల్లుల చెల్లింపులను కూడా ఆపేశారు. దీంతో అభివృ ద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ తది తర శాఖల్లోనే దాదాపు రూ. 50 కోట్ల వరకు విడుదలై నిధులు మురిగిపోతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్లోనైతే సుమారు రూ.10కోట్ల వరకూ చెల్లింపులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. వీరికి సమాధానం చెప్పుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక అభివృద్ధి పనుల పరిస్థితి అయోమయంగా తయారైంది. దాదాపు రూ.40 కోట్లు విడుదల చే యడంతో చాలా వరకు పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని ప్రగతి దశలో ఉన్నాయి. కానీ అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు వాటిపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ పనులను వెంటనే నిలిపివే యాలని ఆదేశించడమే కాకుండా, అప్పటి వరకు చేపట్టిన పనుల బిల్లులు కూడా చెల్లించొద్దని ఉత్తర్వులిచ్చారు. దీంతో ట్రెజరీలో చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పుడా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లంతా బిల్లుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. అప్పు చేసి పనులు చేశామని....ఇప్పుడు అకస్మాత్తుగా పనులతో పాటు చెల్లింపులు నిలిపేయడంతో తామంతా ఇరకాటంలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులైతే వీటిపై కనీసం నోరు మెదపడం లేదు. తామేమీ చేయలేమని చేతులేత్తేస్తున్నారు. ఇక బీసీ కార్పొరేషన్, బీసీ వేల్ఫేర్, హౌసింగ్ తదితర శాఖలకు కనీస నిధులు విడుదల కాలేదు. ఫీజు రియిం బర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. అటు విద్యార్థులు, ఇటు హౌసింగ్ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఒక్క హౌసింగ్ లోనే రూ.30 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులకైతే ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 47కోట్లు చెల్లించాల్సి ఉం ది. ఇక వసతి గృహ విద్యార్థులకు యూనిఫారాలు, నోటు పుస్తకాలు తదితరాల ఊసేలేదు. నిర్వహణ వ్యయ నిధులు కూడా విడుదల చేయలేదు. మిగత శాఖల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఈ విధంగా నిధుల్లేకపోవడంతో అధికారుల చేతులు కట్టేసినట్టయ్యింది. చేతిలో నిధులుంటేనే ఏదైనా చేయగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిని వీడి బదిలీలపై దృష్టి నిధుల సమస్య అధికారులను తీవ్రంగా వేధిస్తుంటే... మరో పక్క బదిలీల భయం వెంటాడుతోంది. బదిలీల పై నిషేధం ఎత్తివేయడంతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు అధికారులు పనిచేశారని, వారందరినీ మార్చేసి వేరేవారిని తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఈమేరకు జిల్లా ,నియోజకవర్గ , మండల స్థాయిల్లో సమావేశాలు పెట్టుకుని ఎవరెవర్ని మార్చాలన్న దానిపై చర్చించుకుంటున్నారు. బదిలీ చేయాల్సిన వారి జాబితాలను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఇప్పుడున్న అధికారులందర్నీ మార్చాలనే అభిప్రాయంతోనే ఉన్నారు. ముఖ్యంగా డ్వామా, జిల్లా పరిషత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, డీఆర్డీఎ, రెవెన్యూ, హౌసింగ్, ఆర్అండ్బీ శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే తమకు సన్నిహితులు, బంధువులులైన అధికారుల పేర్లను తెరపైకి తీసుకొచ్చి, వారే వస్తారని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లింది. బదిలీ చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో ‘ఎలాగూ వెళ్లిపోతాం...ఇంకెందుకని’ పాలనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అందర్నీ ఒక గాటికికట్టేస్తే ఇక పనిచేయడం దండగనే అభిప్రాయానికొచ్చేస్తున్నారు. అటు నిధుల్లేక, ఇటు బదిలీల ప్రకియతో అధికారులు ముందుకెళ్లలేకపోతున్నారు.దీంతో అభివృద్ధి, సంక్షేమ ప్రగతి కుంటుపడుతోంది. -
ప్రతిపాదనలు సరే..కేటాయింపుల మాటేంటి?
తెలుగుగంగకు రూ.334 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించిన అధికారులు హంద్రీ-నీవాకు రూ.750 కోట్లు, గాలేరు-నగరికి రూ.550 కోట్లు ఇవ్వాలని నివేదన సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌కు రూ.150 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదన బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయిస్తేనేకొలిక్కి వస్తాయంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా దశ, దిశను మార్చే సాగునీటి ప్రాజెక్టుల పనులకు 2014-15 బడ్జెట్లో రూ.1,784 కోట్లను కేటాయించాలని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధులు కేటాయిస్తే పనులను శరవేగంగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని నివేదించారు. అధికారులు ప్రతిపాదించిన మేరకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 10న అప్పటి కిరణ్ సర్కారు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆగస్టు రెండో వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కారు సమాయత్తమవుతోంది. ఆ క్రమంలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల అధికారులను ప్రతిపాదనలు పంపాలని కోరింది. దుర్భిక్ష చిత్తూరు జిల్లాను కృష్ణా జలాలతో అభిషేకించి సుభిక్షం చేయాలని దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. జలయజ్ఞంలో భాగంగా హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులను చేపట్టారు. వైఎస్ హయాంలో నిధులు భారీ ఎత్తున కేటాయించడంతో పనులు శరవేగంగా సాగాయి. హంద్రీ-నీవా తొలి దశ పూర్తయింది. గాలేరు-నగరి తొలి దశ పాక్షికంగా పూర్తయింది. తెలుగుగంగ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చింది. స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులకు అవసరమైన పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను అప్పట్లోనే తెచ్చారు. వైఎస్ హఠాన్మరణం సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారింది. రోశయ్య ప్రభుత్వంలో గానీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో గానీ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద మన జిల్లాలో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. హంద్రీ-నీవాకు ఇప్పటిదాకా రూ.5,100 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.1,750 కోట్ల విలువైన పనులు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.416 కోట్లను కిరణ్ సర్కారు కేటాయించింది. ఇప్పుడు కనీసం రూ.750 కోట్లను కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. గాలేరు-నగరి ప్రాజెక్టు కింద కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల పరిధిలో 3.25 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇందులో మన జిల్లాలో 1.03 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కిరణ్ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.321.50 కోట్లు కేటాయించింది. పూర్తి స్థాయి బడ్జెట్లో కనీసం రూ.550 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. తెలుగుగంగ ప్రాజెక్టు కింద నెల్లూరు, చిత్తూరు జిల్లా ల్లో 1.40 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇందులో మన జిల్లాలోనే 49 వేల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే మరో రూ.700 కోట్లు అవసరం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.154 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కనీసం రూ.334 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా 87,734 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు కొత్తగా 23,666 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.300 కోట్లు. అటవీ భూవివాదం పరిష్కారం కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. కిరణ్ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ప్రస్తుతం రూ.150 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు.