అభివృద్ధికి అధికారులకు గడ్డుకాలం | Authorities development Was hard in Vizianagaram | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అధికారులకు గడ్డుకాలం

Published Tue, Aug 12 2014 1:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

అభివృద్ధికి అధికారులకు గడ్డుకాలం - Sakshi

అభివృద్ధికి అధికారులకు గడ్డుకాలం

సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వం నిధుల మంజూరు నిలిపేసింది. అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ ఆపేసింది. జిల్లా నాయక గణం ఉద్యోగుల బదిలీలపై దృష్టి సారించింది. తమకు నచ్చినోళ్లని తీసుకొచ్చేందుకు ప్రస్తుత ఉద్యోగులను సాగనంపే ప్రయత్నంలో పడింది. దీంతో ఉద్యోగులకు బదిలీల భయం పట్టుకుంది. అటు నిధుల్లేక, ఇటు బదిలీలపై టీడీపీ నేతలు చేస్తున్న హల్ చల్‌తో అధికారుల్లో ఆత్మస్థైర్యం సన్నగిలింది. దీంతో విధులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎంత చేసినా గుర్తింపు ఉండదన్న అభిప్రాయానికి వచ్చేశారు. దీంతో ప్రగతి కుంటుపడుతోంది. పం చాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ త దితర ఇంజి నీరింగ్ శాఖలకు నిధుల కొరత ఏర్పడింది. ఇప్పటికే మంజూరైన నిధుల వినియోగంపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
 
 రోడ్లు,  మంచినీటి పథకా లు, కల్వర్టుల, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులకు గత ప్రభుత్వ హయాంలోనే కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. వీటితో కొన్ని పనులు ప్రారంభించగా, మరి కొన్ని పనుల టెండర్ల దశలో ఉన్నాయి. ఇంతలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు వాటిన్నిం టికీ బ్రేక్ వేశారు. ఎక్కడి పనులు అక్కడే నిలిపేయాలని, ప్రారంభించని పనులపై ముందుకెళ్లొద్దని పరో క్ష ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పూర్తయిన పనుల బి ల్లుల చెల్లింపులను కూడా ఆపేశారు. దీంతో అభివృ ద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ తది తర శాఖల్లోనే దాదాపు రూ. 50 కోట్ల వరకు  విడుదలై  నిధులు మురిగిపోతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్‌లోనైతే సుమారు రూ.10కోట్ల వరకూ చెల్లింపులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. వీరికి సమాధానం చెప్పుకోలేక అధికారులు సతమతమవుతున్నారు.
 
 ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక అభివృద్ధి పనుల పరిస్థితి  అయోమయంగా తయారైంది. దాదాపు రూ.40 కోట్లు విడుదల చే యడంతో చాలా వరకు పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని ప్రగతి దశలో ఉన్నాయి. కానీ అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు వాటిపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డెవలప్‌మెంట్ పనులను వెంటనే నిలిపివే యాలని ఆదేశించడమే కాకుండా, అప్పటి వరకు చేపట్టిన పనుల బిల్లులు కూడా చెల్లించొద్దని  ఉత్తర్వులిచ్చారు. దీంతో ట్రెజరీలో చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పుడా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లంతా బిల్లుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. అప్పు చేసి పనులు చేశామని....ఇప్పుడు అకస్మాత్తుగా పనులతో పాటు చెల్లింపులు నిలిపేయడంతో తామంతా ఇరకాటంలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 అధికారులైతే వీటిపై కనీసం నోరు మెదపడం లేదు. తామేమీ చేయలేమని చేతులేత్తేస్తున్నారు. ఇక బీసీ కార్పొరేషన్, బీసీ వేల్ఫేర్, హౌసింగ్ తదితర శాఖలకు కనీస నిధులు విడుదల కాలేదు. ఫీజు రియిం బర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. అటు విద్యార్థులు, ఇటు హౌసింగ్ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఒక్క హౌసింగ్ లోనే రూ.30 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులకైతే  ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద  రూ. 47కోట్లు చెల్లించాల్సి ఉం ది. ఇక వసతి గృహ విద్యార్థులకు యూనిఫారాలు, నోటు పుస్తకాలు తదితరాల ఊసేలేదు. నిర్వహణ వ్యయ నిధులు కూడా విడుదల చేయలేదు. మిగత శాఖల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది.  ఈ విధంగా నిధుల్లేకపోవడంతో అధికారుల చేతులు కట్టేసినట్టయ్యింది. చేతిలో నిధులుంటేనే ఏదైనా చేయగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
 అభివృద్ధిని వీడి బదిలీలపై దృష్టి
 నిధుల సమస్య అధికారులను తీవ్రంగా వేధిస్తుంటే...  మరో పక్క బదిలీల భయం వెంటాడుతోంది. బదిలీల పై   నిషేధం ఎత్తివేయడంతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు అధికారులు పనిచేశారని, వారందరినీ మార్చేసి వేరేవారిని తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఈమేరకు జిల్లా ,నియోజకవర్గ , మండల స్థాయిల్లో సమావేశాలు పెట్టుకుని ఎవరెవర్ని మార్చాలన్న దానిపై చర్చించుకుంటున్నారు. బదిలీ చేయాల్సిన వారి జాబితాలను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఇప్పుడున్న అధికారులందర్నీ మార్చాలనే అభిప్రాయంతోనే ఉన్నారు.
 
 ముఖ్యంగా డ్వామా, జిల్లా పరిషత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, డీఆర్‌డీఎ, రెవెన్యూ, హౌసింగ్, ఆర్‌అండ్‌బీ శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే తమకు సన్నిహితులు, బంధువులులైన అధికారుల పేర్లను తెరపైకి తీసుకొచ్చి, వారే వస్తారని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లింది. బదిలీ చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో ‘ఎలాగూ వెళ్లిపోతాం...ఇంకెందుకని’ పాలనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అందర్నీ ఒక గాటికికట్టేస్తే  ఇక పనిచేయడం దండగనే అభిప్రాయానికొచ్చేస్తున్నారు. అటు నిధుల్లేక, ఇటు బదిలీల ప్రకియతో అధికారులు ముందుకెళ్లలేకపోతున్నారు.దీంతో అభివృద్ధి, సంక్షేమ ప్రగతి కుంటుపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement