నేను రాను బిడ్డో..సర్కార్ దవాఖానకు
ఓ సినీ కవి చెప్పినట్లు నర్సాపూర్‌లోని కమ్యూనిటీ ప్రభుత్వ ఆస్పత్రి తీరు తయారైంది. ఇక్కడ ఖరీదైన మందులు ఉన్నాయి.. కానీ వాటిని ఇచ్చేందుకు సూదులు(ఇంజెక్షన్లు) ఉండవు.. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు అంబులెన్స్ ఉంటుంది.. కానీ డీజిల్ ఉండదు.. పొరపాటున మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకువెళితే అందుకు అవసరమైన సామగ్రి మనమే తెచ్చుకోవాల్సిందే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి ఉంటే మరొకటి లేకపోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యం కోసం జేబులకు చిల్లులు పడుతుండడంతో సర్కార్ దవాఖాన అంటేనే ప్రజలు జంకుతున్నారు.
- ఇంజక్షన్ చేయించుకోవాలంటే సూది తెచ్చుకోవాల్సిదే
- అంబులెన్స్ కావాలంటే డీజిల్ పోసుకోవాలి
- సామగ్రి కొనిస్తేనే పోస్టుమార్టం
- ఇదీ..నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి !
నర్సాపూర్‌లోని కమ్యూనిటీ ప్రభుత్వ ఆస్పత్రిక రోజుకు మూడు నుంచి నాలుగు వందల మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఇన్‌పేషట్లు సరేసరి. నిత్యం రద్దీగా ఉండే ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులతో పాటు ఆస్పత్రి నిర్వహణ కోసం ఏడాదికి రూ.2.5లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇచ్చేందుకు మందులు ఉన్నప్పటికీ సూదులు(నిడిల్స్) ఉండవు. దీంతో రోగులో బ యట నుంచి సూదులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకు 200 ఇం జక్షన్ల చొప్పున లెక్క వేసుకున్నా నెలకు రూ.400 మించదు. అయినా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అనుమతి లేనిదే నిడిల్స్ కొనుగోలు చేయలేమని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆపద కాలంలోనూ.. అన్నీ వ్యయాలే..
ఆపద కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు సైతం ఆర్థిక పరమైన వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను, క్షతగాత్రులను పెద్దాసుపత్రులకు తరలించాల్సి వస్తే అంబులెన్స్‌లో రోగుల సంబదీకులే డీజీల్ పోయిం చాల్సి వ స్తోంది. ఇదిలా ఉండగా ఎవరైనా చని పోయి పోస్టుమార్టం కోసం వస్తే పోస్టుమార్టం సమయం లో వినియోగించె ప్లాస్టిక్ కవర్, వైద్యు లు, సిబ్బంది వాడేం దుకు సబ్బులు, బ్లేడ్లు, గ్లౌజులు ఇతర సామగ్రి కూడా బాధితులే కొనివ్వాల్సి వస్తోంది. ఇక ఇబ్బందికి ఇచ్చే మా మూళ్లు సరేసరి. ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణకు నెలనెల లక్షల రూపాయలు ఖ ర్చు చేస్తున్న అధికారులు చిన్నచిన్న సామగ్రి సైతం అం దుబాటులో ఉంచకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని పేర్కొంటున్నారు.