సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ పార్లమెంటేరియన్, నాగర్ కర్నూలు లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య చైర్మన్‌గా, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కమిటీ కో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. గౌరవ సభ్యులుగా జిల్లా కలెక్టర్, కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. వీరితో పాటు డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు, జెడ్పీ సీఈఓ, పోస్టల్ సూపరింటెండెంట్, మండల పరిషత్ అధ్యక్షులు కూడా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు.
ప్రతి మూడు నెలలకోమారు ఈ కమిటీ సమావేశం కావాల్సి ఉన్నా రాష్ట్ర విభజన, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చివరి సమావేశం గత యేడాది డిసెంబర్ 28న నిర్వహించారు. 16వ లోక్‌సభ కొలువుదీరిన నేపథ్యంలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం విడుదల చేసే నిధుల వ్యయం, ఆయా పథకాల పురోగతిని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రతి మూడు నెలలకోమారు సమీక్షించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం, సామాజిక పింఛన్లు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన తదితర పథకాలకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. నూతన కమిటీ ఏర్పాటు నేపథ్యంలో త్వరలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
విజిలెన్స్ కమిటీ నియామకం
Published Thu, Oct 16 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM
Advertisement
Advertisement