అశాస్త్రీయంగా విభజన ప్రక్రియ
-
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
-
టేకుమట్లను మండలంగా ప్రకటించాలని ర్యాలీ, సభ
-
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం, తోపులాట
చిట్యాల : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా లేదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. టేకుమట్లను మండలంగా ప్రకటించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొర్రె సాగర్ ఆధ్వర్యంలో బుధవారం రామకిష్టాపూర్(టి) నుంచి టేకుమట్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ విస్తీర్ణం, జనాభాపరంగా విస్తరించి ఉన్న టేకుమట్లను మండలంగా చేయకపోవడం విచారకరమన్నారు. జనగాం, గద్వాలలను జిల్లాలుగా ప్రకటించాలన్నారు. గ్యాంగ్‌స్టర్ నÄæూం ఎన్‌కౌంటర్‌ను ప్రజలు మర్చిపోయేలా చేసేందుకే సీఎం కేసీఆర్ తెరపైకి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. కాగా, సభా స్థలి సమీపంలోకి టీఆర్‌ఎస్ నాయకులు చేరుకొని ఆ పార్టీ చేరికల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సౌండ్‌బాక్స్‌లతో పాటలు వేశారు. ఈక్రమంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసు సిబ్బంది రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. కాంగ్రెస్ సభలో ఎంపీపీ బందెల స్నేహలత, వైస్ ఎంపీపీ సట్ల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.