108 ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం | 108 employees by the government of negligence | Sakshi
Sakshi News home page

108 ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Aug 6 2013 4:18 AM | Updated on Aug 17 2018 2:53 PM

రాష్ట్ర ప్రభుత్వం, జీవీకే యాజమాన్యం 108 ఉద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పలు పార్టీల నాయకులు ధ్వజమెత్తారు.

ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం, జీవీకే యాజమాన్యం 108 ఉద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పలు పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. 108 ఉద్యోగుల సమస్యలపై జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్‌లో సోమవారం అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. 108 సిబ్బంది లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగులు, సిబ్బంది పడుతున్న తిప్పలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 
 
 పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ, అత్యవసర సేవలు అందించే 108 సిబ్బందిపై ప్రభుత్వం, జీవీకే యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం న్యాయం కాదన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులను 12 గంటలు పనిచేయిస్తున్నారని, పని గంటలను 8 గంటలకు మార్చాలని డిమాండ్ చేశారు. అరకొర వేతనాలతోనే సిబ్బంది తిప్పలు పడుతున్నారని, వెంటనే వారి వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని అన్నారు. టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు యూనిస్ అక్బానీ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు సాజిత్‌ఖాన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌కుమార్, బీజేపీ నాయకుడు రమాకాంత్, టీఆర్‌ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, సాజిత్‌ఖాన్, 108 ఉద్యోగులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement