బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన రావడంతో బెల్లంపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై ఆశలు రేకెత్తాయి. రాష్ట్రం ఏర్పడితే కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైశాల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను విడదీసి తూర్పు ప్రాంతంలో జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాల కాలం నుంచి ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదన వస్తే తూర్పు ప్రాంతంలో జిల్లా ఏర్పాటు అంశాన్ని పరి శీలిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో బెల్లంపల్లి, మంచిర్యాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఏ ప్రాంత ప్రజ లు ఆ ప్రాంతంలోనే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. బెల్లంపల్లి, మంచిర్యాల లో ప్రత్యేకంగా రాజకీయ, కార్మిక, వ్యా పార, వాణిజ్యవర్గాలతో కమిటీలను కూ డా ఏర్పాటు చేశారు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ పోటాపోటీగా విజ్ఞాపన పత్రాలు అందజేశారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో జిల్లా అంశం తెరపైకి వచ్చింది.
వనరులు పుష్కలం
జిల్లా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు బెల్లంపల్లిలో పుష్కలంగా ఉన్నా యి. విశాలమైన భవనాలు, క్వార్టర్లు, వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు వినియోగానికి అందుబాటులో ఉన్నా యి. తూర్పు ప్రాంతం కేంద్రంగా బెల్లంపల్లి ఇప్పటికే పోలీస్ జిల్లాగా ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకంగా అదనపు ఎస్పీ కా ర్యాలయంతోపాటు ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రధా న రైల్వే మార్గం, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, ఇతర ప్రభుత్వ కార్యాల యాలు ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. గెస్ట్‌హౌజ్‌లు ఇతర సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.
తాజాగా మున్సిఫ్ కోర్టు మంజూరు కాగా, బస్ డిపో మంజూరు కోసం స్థల పరిశీలన కూడా జరిగింది. భౌగోళిక, నైసర్గిక పరిస్థితులు పూర్తిగా జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నాయి. అందుకే చిరకాలంగా ఈ ప్రాంత వాసులు జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. మౌలిక వసతులు అపారంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారంపడే అవకాశాలు ఉండవనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో ఈ ప్రాంత ప్రజలు బెల్లంపల్లి జిల్లా అవుతుందనే కొండంత ఆశతో ఉన్నారు.
బెల్లంపల్లి జిల్లాపై ఆశలు
Published Thu, Aug 8 2013 4:05 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement