శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : ఏరియాలోని ఆర్కే-7 గనిలో కోల్‌ఫిల్లర్ కార్మికుడు ఆడెపు రాజన్న(54) ఊపిరాడక మృతి చెందాడు. తోటి కార్మికుల కథనం ప్రకా రం.. ఎప్పటిలాగానే రాజన్న మంగళవారం రాత్రి డ్యూటీకి వచ్చాడు. 2ఏ సీమ్, 34 లెవల్ వద్ద విధులు నిర్వహించాడు. బుధవారం ఉద యం 6.00 గంటల సమయానికి రెండు టబ్బ ల వరకు నింపాడు. రెండో టబ్బులో కొంత ఖాళీ ఉంది. ఇంతలో అస్వస్థతగా అనిపించడం తో కుళాయి వద్దకు వెళ్లి నీళ్లు తాగివచ్చాడు. మళ్లీ తట్టా ఎత్తడం మొదలు పెట్టగానే ఒక్క సారిగా కాళ్లు, చేతులు లాగుతున్నాయంటూ కుప్పకూలాడు. ఒళ్లంతా చెమటలు పట్టడంతో తోటి కార్మికులు అతడిని గాలి ఉన్న ప్రదేశానికి తీసువచ్చి సపర్యలు చేస్తుండగానే మృతి చెం దాడు. మైనింగ్ సర్దార్ నాగేశ్వర్‌రావు, ఓవర్‌మన్ రాయమల్లు, కార్మికులు కలిసి మృతదేహా న్ని ఉపరితలానికి తీసుకువచ్చారు. తర్వాత రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లా రు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమార్తె లు, ఒక కొడుకు ఉన్నారు.
గాలి అందకే మృతి : కార్మికులు
గాలి సరిగా అందకనేరాజన్న మృతి చెందాడ ని కార్మికులు ఆరోపించారు. పని స్థలంలో గాలి సరిగా లేదని, ఎక్కువగా ఉక్కపోస్తుంద ని, ఒక్కోసారి ఊపిరి ఆడడంలేదని తెలిపారు. మూడు నెలలుగా సమస్యను అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వివిధ కార్మిక సంఘాల నేతలు గని వద్దకు చేరుకుని గని మేనేజర్ రామారావు, సేఫ్టీ అధికారి లక్ష్మణ్, ఏరియా ఎస్‌ఓటూ జీఎం మల్లికార్జున్‌రా వు, ఏజీఎం(పర్సనల్) మహమ్మద్ అబ్బాస్, గని ఏజెంట్ హబీబ్‌హుస్సేన్‌లను నిలదీశా రు. కనీసం మృతుడి భార్యా పిల్లలు గని వద్ద కు రాకుండానే శవాన్ని ఆస్పత్రికి ఎలా పంపిం చారని మండిపడ్డారు. అధికారులు ఏమని రిపోర్టు రాసారో చూడకుండానే గుర్తింపు సం ఘం నాయకులు, అధికారులు కలిసి హాడావుడిగా పోస్టుమార్టంకు తరలించారని ఆరోపిం చారు. అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్న గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ తదితర యూని యన్ల నాయకులు మృతుడి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు.
సంస్థ నిర్లక్ష్యమే కారణం : ఏఐటీయూసీ
యాజమాన్యం నిర్లక్షం కారణంగానే రాజన్న మృతి చెందాడని, గని మేనేజర్, రక్షణ అధికారులపై చర్య తీసుకోవాలని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి కె.వీరభద్రయ్య, ఉపాధ్యక్షు డు మంద మల్లారెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, జడల పోశం డిమాండ్ చేశారు. గతంలో ఇదే గనిలో గడ్డం రాజయ్య అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందినప్పుడు గనిలో వెంటిలేషన్ బాగుందని కితాబిచ్చిన అధికారులు నేడు జరి గిన ఘటనకు సమాధానం చెప్పాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు.
చర్య తీసుకోవాలి : వైఎస్సార్ టీయూసీ
రాజన్న మృతికి కారకులైన అధికారులపై చర్య తీసుకోవాలని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్తినేని రవికుమార్, చీఫ్ ఆర్గనైజిం గ్ సెక్రెటరీ చల్లగుల్ల విజయశ్రీ డిమాండ్ చేశా రు. చాలా గనుల్లో వెంటిలేషన్ సమస్య ఉంద ని, యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై చూపడం లేదన్నారు. ఇటివల కాలంలో గనుల్లో ఇలాం టి మరణాలు అధికంగా జరుగుతున్నాయని, వీటిని గుండెపోటులుగా చిత్రీకరిస్తూ అధికారు లు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఐఎఫ్‌టీయూ
గనిలో వెంటిలేషన్ సరిగా అందించనందుకు బాధ్యులైన అధికారులందరిపైనా చర్య తీసుకోవాలని ఐఎఫ్‌టీయూ శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు కె.దేవయ్య డిమాండ్ చేశారు. కార్మికుడు చనిపోతే గని వద్దకు అతని భార్య, పిల్లలు రాకముందే శవాన్ని ఆస్పత్రికి తరలిం చారని ఇది అధికారుల అమానవీయ చర్యకు నిదర్శనమన్నారు.
ఊపిరాడక కార్మికుడి మృతి
Published Thu, Aug 8 2013 4:00 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement