- పెండింగ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- 1,291 కోర్టుల్లో 18 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు వెల్లడి
- ముంబై, పరిసర ప్రాంతాల్లోనే 4.5 లక్షలు నమోదు
ముంబై: రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పడు చార్జ్‌షీట్, సాక్షాలు, ఆధారాలు లేని ఇతరత్రా కేసులను వెనక్కి తీసుకోవాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని 1,291 కోర్టుల్లో 18 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 25 శాతం (4.5 లక్షల) కేసులు కేవలం ముంబై దాని పరిసర ప్రాంతాల్లో నమోదయ్యాయని రాష్ట్ర హోం శాఖ తెలియజేసింది. సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని కేసులు నమోదు చేశారని, దర్యాప్తు పూర్తి కాకపోయినప్పటికీ చార్జ్‌షీట్ దాఖలయ్యేవని హోం శాఖ అధికారులు తెలిపారు.
ఉపసంహరించుకోవాల్సిన కేసులను పరిశీలించడానికి జిల్లా ముఖ్య అధికారి, సెషన్స్ జడ్జి నేతృత్వంలో ప్రతి జిల్లాలో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డెరైక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాది కమిటీలో ఉంటారు. తాలుకా ముఖ్య కేంద్రాల్లో కూడా సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలో ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి, వాటిని వివిధ విభాగాల వారిగా విభజిస్తారు. సంబంధిత కేసులను ఉపసంహరించుకోవచ్చా లేదా అనేది న్యాయ శాఖను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు.
కేసులు ఉపసంహరించుకుందాం
Published Sun, May 17 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement