
న్యూఢిల్లీ: సీబీఐ దర్యాప్తు ముగించిన 6,700 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తెలిపింది. ఇందులో 275 కేసులు 20 ఏళ్లు పైబడి న్యాయస్థానాల్లో విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని 2021 సంవత్సరం నివేదికలో వెల్లడించింది.
వీటితోపాటు 10,974 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు వివరించింది. వీటిలో 361 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లకు పైగా హైకోర్టులు, సుప్రీంకోర్టులో మూలుగుతున్నాయంది. పనిభారం, సిబ్బంది కొరత, అనుమతుల్లో జాప్యం, కరోనా కారణాలతో దర్యాప్తు జాప్యం అవుతోందని సీవీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment