New Delhi: Tejashwi Yadav To Appear Before CBI For Questioning In Land For Jobs Scam - Sakshi
Sakshi News home page

Land For Jobs Scam: సీబీఐ విచారణకు హాజరైన తేజస్వి యాదవ్‌

Published Sat, Mar 25 2023 11:14 AM | Last Updated on Sat, Mar 25 2023 1:32 PM

New Delhi: Tejashwi Yadav To Appear Before Cbi For Questioning In Land For Jobs Scam - Sakshi

న్యూఢిల్లీ: బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ల్యాండ్‌ ఫర్ జాబ్‌ స్కాం కేసులో నేడు (శనివారం) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముందు హాజరయ్యారు. ఢిల్లీ హైకోర్టులో తేజస్వీ యాదవ్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఆయనను ఈ నెలలో అరెస్టు చేయబోమని సీబీఐ తెలిపింది. ఆ తర్వాత తేజస్వి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు అంగీకరించారు. 

ఢిల్లీలోని తన ఇంటి నుంచి బయలుదేరి సీబీఐ కార్యాలయానికి  చేరుకున్నారు తేజస్వి యాదవ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనని పోరాటం వైపు నడిపిస్తున్నాయని.. ఆ సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పోరాటంలో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలకు తాను ఎప్పుడూ సహకరిస్తున్నట్లు తెలిపారు. మరో వైపు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ, తేజస్వి సోదరి మిసా భారతి కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మిసా భారతి ఈడీ ప్రశ్నించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement