రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంటవరకూ తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి ఆరోపించారు.
సాక్షి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంటవరకూ తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి ఆరోపించారు. బెంగళూరులో మీడియాతో ఆయన సోమవారం వ ూట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బు వసూలుకు పాల్పడుతోందన్నారు.
నైట్‌లైఫ్ వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తెలిసి కూడా హోటల్, మద్యం షాపు యజమానుల లాబీయింగ్‌కు తలొగ్గి నైట్‌లైఫ్ విస్తరణకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. వెంటనే తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కుతీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులను, మైనారిటీలను ఓటు బ్యాంకుగా భావించిందే తప్ప వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటు పడలేదన్నారు. ఇదే విషయాన్ని సాక్షాత్తు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వెల్లడించారన్నారు.
ఇందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని ప్రహ్లాద్‌జోషి వ్యంగ్యంగా అన్నారు. ఇదే సందర్భంలో బెంగళూరు దక్షిణ ఎంపీ అన ంతకుమార్ మాట్లాడుతూ... ప్రధాని పదవికి రాహుల్‌గాంధీ అనర్హుడన్నారు. గత తొమ్మిది నెలల్లో దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదన్నారు. మాజీముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి బీజేపీ రావ డం వల్ల పార్టీకి నూతన శక్తివచ్చినట్లయిందని ఆనంతకుమార్ అభిప్రాయపడ్డారు.