- విద్యాపరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి
- డీఎస్‌యూ ఆధ్వర్యంలో సదస్సు
కేయూ క్యాంపస్ : సరైన ప్రణాళిక లేకుండా నే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విద్యాపరి రక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నర్సిం హారెడ్డి విమర్శించారు. డెమోక్రటిక్ స్టూడెం ట్స్ యూనియన్ (డీఎస్‌యూ) ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యారంగం, భవిష్యత్ లక్ష్యాలు - కార్యాచరణ’ అంశంపై హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్‌హాల్‌లో శనివారం స దస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో నర్సిం హారెడ్డి మాట్లాడుతూ సీఎం చెప్పిన మాటల ప్రకారం ఉచిత విద్య కొందరికే చేరువయ్యే అవకాశముందన్నారు. సాధ్యాసాధ్యాలను సరిగా పరిగణనలోకి తీసుకోకుండా ప్రకట నలు చేయడం కాకుండా.. స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇక కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం ఇంత వరకు తన వైఖరి ప్రకటించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంఈఓ పోస్టులతో పాటు కళాశాలల్లో ఖాళీల ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం పాఠ్యాం శాల్లో వేదాలు, ఉపనిషత్తులను చేర్చి మనువాద రాజ్య స్థాపనకు కుట్ర పన్నుతోందని విమర్శించారు.
సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టకుండా.. రేషనలైజేషన్ పేరి ట వేలాది స్కూళ్ల మూసివేతకు కుట్ర పన్నారని ఆరోపించారు. సదస్సులో డీఎస్‌యూ రాష్ట్ర అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంచర్ల బద్రి, అరుణాంక్‌తో పాటు సంపత్‌రెడ్డి, జేసీ.పాణి, అమృతరాజు, సిద్ధార్థ, శ్రావణ్, జనార్దన్, అవినాష్, అనిల్, సదయ్య, శివ, నగేష్, భాస్కర్, శ్రీకాంత్, సురేష్, ప్రేంసాగర్ పాల్గొన్నారు.