narsinhareddi
-
నేను సైతం
టీచర్ కావాలనుకున్న ఆయన కలను పేదరికం మొగ్గలోనే తుంచివేసింది. కానీ... సమాజ మార్పుకోసం తనకు చేతనైనంత పని చేయాలన్న ఆయన తృష్ణను మాత్రం తుంచలేకపోయింది. అందుకోసం తన పాన్ డబ్బానే వేదికగా చేసుకున్నాడు నర్సింహారెడ్డి. తాను రాసిన మహాత్ముల నీతి వాక్యాలు, పదునైన నినాదాలతో... రోజుకు వేలమంది వెళ్లే ఆ మార్గంలో ఒక్కరిలో మార్పు వచ్చినా చాలంటున్నాడు. హోటల్ మారియట్ దగ్గర కవాడిగూడ చౌరస్తా. రోడ్డు పక్కన చిన్న పాన్ డబ్బాను నిర్వహిస్తున్నాడు నరసింహారెడ్డి. షామీర్పేట అతని స్వస్థలం. ఉపాధ్యాయుడు కావాలన్న ఆయన కలకు పేదరికం అడ్డంకిగా మారింది. అంతే చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. ఓవైపు పోలియో కారణంగా వచ్చిన వైకల్యం. అయినా ఎక్కడా కుంగిపోలేదు. వైకల్యాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. 1992లో ఓ పాన్ డబ్బా ఏర్పాటు చేశాడు. అది మొదలు... ఉదయం ఆ డబ్బా ఓపెన్‌చేయగానే తనను ఆకర్షించిన ఏదో ఒక నినాదం రాసి ఆ బోర్డును డబ్బాకు తగిలిస్తాడు న ర్సింహారెడ్డి. 23 ఏళ్లుగా తన అక్షరాల ద్వారా చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. సూక్తులెన్నో... ‘ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు, సమాజానికి సేవాలయాలు, దేవాలయాలు. కానీ, అవినీతికి అడ్డాగా మారాయి’ అంటూ రాసి ఉన్న ఓ సూక్తి నడుస్తున్న చరిత్రకు అద్దం పడుతోంది. ఆ పక్కనే మరో బోర్డుపై ‘భారతదేశానికి గత 65 ఏళ్లుగా ఉత్తమ నాయకుల, అధికారుల కొరత ఉంది. ప్రతి నియోజకవర్గం గుండె చప్పుడు అదే’ అన్న మరో సూక్తి కూడా ఇట్టే ఆకర్షిస్తోంది. ‘నీ మీద నీకు నూరు శాతం నమ్మకముంటే ఓ మహాత్ముడిగా, మహర్షిగా ఎదుగుతావు’, ‘ఉత్తమ గురువంటే ఎవరు?, నిజమైన నాయకుడు ఎలా ఉండాలి?, ఈ దేశ సంపదలో నల్లధనం ఎన్ని కోట్లుంది?’ అని ప్రతి మనిషికీ అర్థమయ్యేలా వివరిస్తుంటాడు నర్సింహారెడ్డి.. సామాజిక బాధ్యత... ‘ఇలా రోజూ నాలుగైదు వాక్యాలు పదిమందికి తెలిసేలా బోర్డులపై రాసి పాన్ డబ్బా వద్ద ప్రదర్శిస్తుంటా. ఒకరోజు రాసినవి మరో రోజు ఉండవు. ఈ సూక్తులు రాయడానికి పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. పుస్తక పఠనం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పదిమందికి పంచడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నా. ఓ రకంగా నేను కలగన్న ఉపాధ్యాయ వృత్తి అభిలాషను ఇలా తీర్చుకుంటున్నా’నని చెబుతున్నాడు నర్సింహారెడ్డి. -
ఉచిత విద్యకు ప్రణాళికలు రూపొందించాలి
విద్యాపరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డీఎస్‌యూ ఆధ్వర్యంలో సదస్సు కేయూ క్యాంపస్ : సరైన ప్రణాళిక లేకుండా నే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విద్యాపరి రక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నర్సిం హారెడ్డి విమర్శించారు. డెమోక్రటిక్ స్టూడెం ట్స్ యూనియన్ (డీఎస్‌యూ) ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యారంగం, భవిష్యత్ లక్ష్యాలు - కార్యాచరణ’ అంశంపై హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్‌హాల్‌లో శనివారం స దస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నర్సిం హారెడ్డి మాట్లాడుతూ సీఎం చెప్పిన మాటల ప్రకారం ఉచిత విద్య కొందరికే చేరువయ్యే అవకాశముందన్నారు. సాధ్యాసాధ్యాలను సరిగా పరిగణనలోకి తీసుకోకుండా ప్రకట నలు చేయడం కాకుండా.. స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇక కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం ఇంత వరకు తన వైఖరి ప్రకటించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంఈఓ పోస్టులతో పాటు కళాశాలల్లో ఖాళీల ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం పాఠ్యాం శాల్లో వేదాలు, ఉపనిషత్తులను చేర్చి మనువాద రాజ్య స్థాపనకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టకుండా.. రేషనలైజేషన్ పేరి ట వేలాది స్కూళ్ల మూసివేతకు కుట్ర పన్నారని ఆరోపించారు. సదస్సులో డీఎస్‌యూ రాష్ట్ర అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంచర్ల బద్రి, అరుణాంక్‌తో పాటు సంపత్‌రెడ్డి, జేసీ.పాణి, అమృతరాజు, సిద్ధార్థ, శ్రావణ్, జనార్దన్, అవినాష్, అనిల్, సదయ్య, శివ, నగేష్, భాస్కర్, శ్రీకాంత్, సురేష్, ప్రేంసాగర్ పాల్గొన్నారు.