తుమకూరులో సీఎం ఎన్నికల ప్రచారం
తుమకూరు : జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను కోరారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తుమకూరు జిల్లాలో పర్యటించారు. తుమకూరు నగరంలో ఉన్న గ్రంథాలయం వద్ద ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గ్రామ స్వరాజ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం అనంతరం కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడుతూ... తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ, ప్రాంతాలకు ఎత్తినహోళె పథకంలో నీరును అందించే పనులు జరుగుతున్నాయని, ఇందులో ఎటివంటి అపోహలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే బీజేపీ, జేడీఎస్ పార్టీలు అబద్దాలు చెప్పుకుని కాలం వెల్లదీస్తున్నాయన్నారు.
అనంతరం ఎంపీ, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా గడచినా ఒక్క రూపాయి కూడా నల్లధనాన్ని ఇండియాకు తీసుకురాలేదని అన్నారు. బడా కంపెనీలకు మాత్రం లబ్ధి చేకూర్చే పనిలో ఉందని ఆరోపించారు. సమావేశంలో హోంమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, ఇన్‌చార్జ్ మంత్రి టిబి.జయచంద్ర, మాజీ సీఎం వీరప్పమొయిలీ, ఎంపి. ముద్దహనుమేగౌడ, ముఖ్యమంత్రి చంద్రు, రెహామాన్, ఎమ్మెల్యే రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను మరింత బలపరచండి
Published Tue, Feb 9 2016 2:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement