యశవంతపుర : చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తే గెలవటం అసాధ్యమంటూ ఇంటెలిజెన్స్ విభాగం పేరుతోనున్న ఓ పత్రం వైరల్ కావడం సంచలనం రేగింది. అయితే ఇది నకలీ నివేదిక అని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఈ నివేదికపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీఐజీకి సూచించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కాగా, అలాంటి నివేదిక ఏదీ ఇంటెలిజెన్స్ వర్గాలు తమ కార్యాలయానికి ఇవ్వలేదని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. తమ విభాగం కన్నడలో మాత్రమే ఇస్తుందని, అయితే నివేదిక ఆంగ్లంలో ఉన్నందున అది నకిలీదని నిఘా అధికారులు ఖండించారు.
అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి (వరుణ), బసవకల్యాణ, గంగావతి, శివాజీనగర నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏలా ఉంటుందనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు గోప్యంగా నివేదిక చేయించారు. నాలుగు చోట్ల కూడా ఓడిపోతారంటూ నివేదిక శుక్రవారం రాత్రి నుండి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ నివేదికపై జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం సిద్ధరామయ్యపై పలు ఆరోపణలు చేశారు. అయన హుబ్లీలో విలేకర్లతో మాట్లాడారు. తను ఎక్కడ నుండి పోటీ చేయాలో సర్వే చేయించి అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కుమార ఆరోపించారు.
నేడు ప్యాలెస్ మైదానంలో రాహుల్ సభ
సాక్షి, బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించనుంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొ ంటారు. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ సభకు దీటుగా జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు. ఇందుకోసం మూడు వేలకు పైగా కేఎస్‌ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులను కేటాయించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు జ్ఞానభారతి ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని ప్యాలెస్ మైదానం చేరుకుని సభలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment