Fake reports
-
జనగణన లేకుండా ఈ లెక్కలేల?
పటా్న: ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు. తాజాగా జనగణన చేపట్టకుండానే దేశంలో హిందూ, ముస్లింల జనాభాపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తుందని నిలదీశారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని, హిందువుల జనాభా తగ్గిందంటూ విడుదలచేసిన ఈఏసీ–పీఎం రిపోర్ట్‌పై తేజస్వీ స్పందించారు. ‘‘ అసలైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే హిందూ, ముస్లింల మధ్య మోదీ సర్కార్ చిచ్చుపెడుతోంది. జనాభా లెక్కలు లేకుండానే ఎలా ఈ కొత్త లెక్కలతో వచ్చారు? 2021లో కూడా జనగణన ఎందుకు సాధ్యంకాలేదు. అప్పుడు, ఇప్పుడు మీరే ప్రధాని. హిందూ, ముస్లింలను వేర్వేరుగా పక్షపాత ధోరణితో చూసే విధానాన్ని విడనాడండి. సమస్యల గురించే మాట్లాడండి’ అని ప్రధానికి తేజస్వీ హితవు పలికారు. షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్: ఏ క్రాస్ కంట్రీ అనాలసిస్(1950–2015) పేరిట ఈఏసీ–పీఎం ఒక నివేదిను తయారుచేసింది. 1950వ సంవత్సరంను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే దేశ జనాభాలో 84.68 శాతంగా ఉన్న హిందువులు 2015 ఏడాదివచ్చేసరికి 78.06 శాతానికి తగ్గారు. అంటే దేశజనాభాలో హిందువుల వాటా 7.82 శాతం తగ్గింది. అదే సమయంలో దేశజనాభాలో ముస్లింలు 9.84 శాతంగా ఉంటే 2015 ఏడాదినాటికి దేశజనాభాలో వారు 14.09 శాతానికి పెరిగారని నివేదిక పేర్కొంది. -
అదానీ గ్రూప్‌పై ఆధారాలున్నాయా?
న్యూఢిల్లీ: విదేశీ రిపోర్టులను సాక్ష్యాధారాలుగా పరిగణించలేమని, అందులోని అంశాలను స్వచ్ఛమైన నిజాలుగా భావించలేమని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ ఇద్దరు విదేశీ ఇన్వెస్టర్ల ద్వారా ఇన్సైడర్ ట్రేగింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) అనే విదేశీ స్వచ్ఛంద సంస్థ ఓ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్ ఈ సంస్థను స్థాపించారు. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో.. అక్రమాలకు పాల్పడిన అదానీ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు వ్యక్తులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. ‘‘విదేశీ నివేదికలను కచి్చతంగా నిజాలుగా ఎందుకు స్వీకరించాలి? ఓసీసీఆర్పీ నివేదికను మేము తోసిపుచ్చడం లేదు. కానీ, అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు కావాలి. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా మీ దగ్గరున్న ఆధారాలేమిటి?’’ అని ప్రశాంత్ భూషణ్‌ను ప్రశ్నించింది. -
ఫేక్ పార్టీ..ఫేక్ రిపోర్టులు
-
భారత్‌లో కరోనా మరణాలు 40 లక్షలు?
లండన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్‌లో రెండేళ్లలో ఏకంగా 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికారిక లెక్కల్లోకి రాని కోవిడ్ మృతుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని పేర్కొంది. 2020 జనవరి–2021 డిసెంబర్ మధ్య మరణించిన వారి సంఖ్య కేంద్రం వెల్లడించిన లెక్కల కంటే ఏకంగా 8 రెట్లు ఎక్కువని తెలిపింది. 2021 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 22.3 శాతం భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. రెండేళ్ల కాలంలో కరోనా మృతులపై 191 దేశాల గణాంకాలతో లాన్సెట్ నివేదిక రూపొందించింది. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 59.4 లక్షల మంది కరోనాకు బలైనట్టు అధికారిక గణాంకాలున్నాయి. కానీ వాస్తవానికి 1.82 కోట్ల మంది మరణించినట్టు అధ్యయనంలో తేలినట్టు లాన్సెట్ వెల్లడించింది. భారత్‌లో కరోనాతో రెండేళ్లలో 4.89 లక్షల మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించిందని, కానీ వాస్తవానికి 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు తేలిందని వివరించింది. భారత్ తర్వాత అమెరికా (11.3 లక్షల మరణాలు), రష్యా (10.7 లక్షలు), మెక్సికో (7.98 లక్షలు), బ్రెజిల్ (7.36 లక్షలు), ఇండోనేసియా (7.36 లక్షలు), పాకిస్తాన్ (6.64 లక్షలు) ఉన్నట్టుగా వివరించింది. తప్పుడు సమాచారం: కేంద్రం లాన్సెట్ లెక్కల్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆ సంస్థ విశ్లేషణలు, అంచనాలు ఊహాజనితాలని విమర్శించింది. కరోనా మరణాల లెక్కలు సేకరించే పద్ధతిలో తప్పులు దొర్లాయని ఆ నివేదిక రచయితలే అంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
మరణించిన శిశువు బతికుందని..
సూర్యాపేట క్రైం: శిశువుకు హార్ట్ బీట్ లేకున్నా బతికుందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు రిపోర్టు ఇచ్చారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి ప్రాణం లేని శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని హాస్పిటల్‌పై బంధువులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన మరిపెద్ది లావణ్యకు పురిటినొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని మాధవి ఆస్పత్రికి ఆదివారం ఉదయం తీసుకొచ్చారు. డాక్టర్ సలహా మేరకు లావణ్యకు దగ్గర్లోని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. భర్త శ్రీకాంత్‌గౌడ్ మరోసారి ఆపిల్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్లు మృత శిశువును బయటికి తీశారు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌పై దాడి చేశారు. జన్యు సంబంధిత వ్యాధితో శిశువు మృతి చెందినట్లు డాక్టర్ మాధవి వివరణ ఇచ్చారు. -
భార్య నుంచి పారిపోవడానికి భర్త మాస్టర్ ప్లాన్!
భోపాల్: దేశంలో కరోనా సృష్టించిన విధ్వంసం మనందరికి తెలిసిందే. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, కరోనా సోకిన వ్యక్తి, 14 రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ సమయంలో వారితో ఎవరు కలవకుండా, సామాజిక దూరం పాటించాలన్న విషయం తెలిసిందే. అయితే, కొందరు ఈ నిబంధనను తమ వ్యక్తిగత విషయాల కోసం దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండోర్‌లోని మోవ్ అనే ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తికి గడిచిన ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అతనికి భార్య, ఇంట్లోవారితో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైle ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. కాగా, దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఒక ప్రైవేటు ల్యాబ్ నుంచి కోవిడ్ సోకిన వ్యక్తి రిపోర్ట్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. దానిపై అతని పేరును మార్చి, తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత , ఆ రిపోర్ట్‌ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్ చేశాడు. అయితే, కుటుంబ సభ్యులు,ఈ వాట్సప్ చూసి షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అతనికి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. దీంతో, వారికి తమ కుమారుని ప్రవర్తనపై అనుమానం కలిగింది. వారు వెంటనే ఆ వాట్సప్‌లో ఉన్న ప్రైవేటు ల్యాబ్‌ను వెళ్లి సంప్రదించారు. అప్పుడు వారికి తమ కొడుకు చేసిన మోసం బయటపడింది. దీంతో, ఆశ్చర్యపోయి, వారు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆ ల్యాబ్ టెక్నిషియన్ మాత్రం, తమ ల్యాబ్ రిపోర్ట్‌ను ఫోర్జరీతో మార్పిడి చేసినందుకుగాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గ్వల్టోలి పోలీసులు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదుచేశారు. -
జాతిరత్నాలు.. స్కూల్ డుమ్మా కొట్టేందుకు ఏం చేసారంటే?
లండన్: విద్యార్థులు పాఠశాలలకు డుమ్మా కొట్టాలంటే కాలు నొప్పి, కడుపు నొప్పి అని గతంలో చెప్పేవాళ్లు. కానీ ప్రస్తుత టెక్నాలజీ అందుబాటులో ఉండడం, దానికి తోడు వారి తెలివి తేటల కారణంగా.. కరోనా లేకపోయినా పాజిటివ్ వచ్చినట్టు రిపోర్ట్ సృష్టించి స్కూల్‌కు బంక్ కొట్టేస్తున్నారు. అసలు ఇలాంటివి ఎలా సాధ్యమౌతుందనే కదా మీ ప్రశ్న? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. యూకేలో పిల్లలు కాదు బాబోయ్ పిడుగులు.. యూకే లోని టీనేజర్స్ పాఠశాలలకు బంక్ కొట్టేందుకు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. కోవిడ్ పాజిటివ్ పరీక్షలను ఎలా నకిలీ చేయాలనే దానిపై విద్యార్థులు చిట్కాలను నేర్చుకోవడమే గాక ఆ చిట్కాని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఇతరులకు తెలియజేస్తున్నట్లు తెలిసింది. యుకే లోని ఐన్యూస్ నివేదిక ప్రకారం.. కోవిడ్ నిర్థారణ పరీక్ష జరిపే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్‌పై నిమ్మరసంతోపాటు ఇతర రకరకాల ద్రవాలను వేయడం వల్ల కరోనా పాజిటివ్ రిపోర్ట్ వస్తున్నట్లు స్టూడెంట్స్ తెలుసుకున్నారు. అంతేగాక ఇది ఎలా సాధ్యమో వివరిస్తూ టిక్‌టాక్‌లో వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇక వెంటనే వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్‌తో పాటు లైక్స్ కూడా వస్తోందట. ఇదే పేరుతో టిక్‌టాక్‌లో ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఉండగా.. దానికి 20 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. సిట్రస్ ద్రవాల కాంబినేషన్లతో కరోనా పాజిటివ్ రిపోర్ట్ కోవిడ్ టెస్ట్ కిట్స్‌పై లెమన్ జ్యూస్, కోకా కోలా, వెనిగర్, సిట్రస్ ద్రవాల కాంబినేషన్లను వేయగా రిపోర్ట్ కాస్త పాజిటివ్‌గా చూపిస్తుండడం గమనార్హం. ఈ రిపోర్ట్‌నే చూపిస్తూ.. స్కూలుకు బంక్ కొడుతున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా ఉండటానికి ఇదే ప్లాన్ అనుసరిస్తుండటంతో విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొంత మంది విద్యార్థులు నిజంగానే కోవిడ్ బారిన పడుతున్నారని, అయితే కొందరు మాత్రమే ఇలా ఫేక్ రిపోర్టులు సృష్టిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజీ లీడర్స్ ప్రధాన కార్యదర్శి జెఫ్ బార్టన్ తెలిపారు. ప్రస్తుతం స్టూడెంట్స్ ఫాలో అవుతున్న ఈ నకిలీ రిపోర్ట్ బాగోతంపై ఫుల్ ఫ్యాక్ట్ అనే ఓ నిజనిర్ధారణ సంస్థ ప్రయోగాలు చేసింది. వారి ప్రకారం.. సిట్రస్ స్వభావం ఉన్న పండ్లను ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్‌పై వేస్తే కరోనా ఫలితం పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు చూపిస్తోందని తెలపడం విశేషం. -
కుంభమేళా స్నానాల్లో లక్ష ఫేక్ కరోనా రిపోర్టులు..?
డెహ్రాడూన్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కాస్త తగ్గింది. గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో మహ కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంభమేళాకు వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. కాగా కుంభమేళాలో కరోనా టెస్టుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది. కుంభమేళా సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సుమారు 4 లక్షల మేర కరోనా టెస్టులు చేయగా అందులో సుమారు ఒక లక్ష వరకు కరోనా ఫేక్ రిపోర్ట్‌లను ఇచ్చారని తేలింది. పరీక్షలు చేయకుండానే కరోనా టెస్టు రిపోర్టులు జారీ చేశారని బయటపడింది. ఒకనొక సందర్భంలో ఒకే ఫోన్ నంబర్‌ను వినియోగించి సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించారు. అంతేకాకుండా కరోనా టెస్టులు చేసుకున్నవారి సమాచారం పూర్తిగా ఫేక్ అని తేలింది. హరిద్వార్‌లోని ఒకే ఇంటి చిరునామాను ఉపయోగించి సుమారు ఐదు వందల మందికి కరోనా టెస్టులను నిర్వహించారు. కరోనా టెస్టుల్లో ఓ ప్రైవేటు ఎజెన్సీ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. డేటాఎంట్రీ ఆపరేటర్లతో,విద్యార్థులతో టెస్టులు నిర్వహించారు. ఫేక్ రిపోర్టుల విషయంపై కుంభమేళా హెల్త్ ఆఫీసర్ అర్జున్ సింగ్ సెనగర్ స్పందించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతుందని తెలిపారు. టెస్టుల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు.15 రోజుల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను అందిస్తామని హెల్త్ సెక్రటరీ అమిత్ నేగి పేర్కొన్నారు. కరోనా టెస్టులపై సమగ్ర విచారణ పూర్తి అయ్యేంత వరకు ప్రైవేటు ఎజెన్సీలకు చెల్లింపులను నిలిపివేయాలని హరిద్వార్ మేజిస్ట్రేట్ కోర్టు తెలిపింది. (చదవండి: సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు) -
ప్రైవేటు ఆసుపత్రిలో పాజిటివ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో నెగెటివ్..
సాక్షి, వేములవాడ(సిరిసిల్ల): పట్టణంలోని మల్లారం రోడ్డులో ఉన్న మాతృశ్రీ అనే ఆసుపత్రిలో కరోనాపై తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. చిట్టి మంగమ్మ అనే పేషెంట్ స్వల్ప లక్షణాలతో ఆసుపత్రికి చేరుకోవడంతో కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిందని అడ్మిట్ చేసుకున్నారు. ఇందుకు రూ.లక్షన్నర కావాలని చెప్పడంతో తన వద్ద డబ్బులు లేవని పేర్కొంటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరోసారి కరోనా టెస్టు చేయించగా ఆమెకు నెగెటివ్ రావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెగటివ్ రిపోర్టు ఆధారంగా ఆమె ఫిర్యాదు మేరకు మాతృశ్రీ ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
నాలుగు శాంపిల్స్‌తో 15 మందికి పాజిటివ్
భోపాల్: కరోనా వైరస్ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తోంటే.. దీన్ని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో ఆస్పత్రికి వెళ్తే కరోనా పేరు చెప్పి వేలకు వేలు వసూలు చేస్తోన్న వైనాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఆరోగ్య శాఖ సాంకేతిక నిపుణుడు తమ ప్రాంతంలోని ల్యాబ్‌పై అనేక ఆరోపణలు రావడంతో వాస్తవాలు ఏంటో తేల్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ నలుగురి శాంపిల్స్ టెస్ట్‌కు పంపాడు. సదరు ల్యాబ్ ఏకంగా దాదాపు 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేల్చింది. దాంతో ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. వివరాలు ధార్ జిల్లా తానా గ్రామానికి చెందిన గుమాన్ సింగ్ అనే వ్యక్తి తమ ప్రాంతంలో కరోనా టెస్ట్‌లు చేస్తోన్న ల్యాబ్‌పై అనేక ఆరోపణలు రావడం విన్నాడు. దాంతో టెస్ట్ చేద్దామని భావించి గ్రామంలోని ఓ నలుగురి స్వాబ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపాడు. వీటిని పరీక్షించిన సదరు పరీక్షా కేంద్రం ఏకంగా 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేల్చింది. (చదవండి: ప్రైవేట్ ఆసుపత్రులకు... భారీగా అనుమతులు) విశేషం ఏంటంటే వారిలో చాలా మంది శాంపిల్స్ తీసుకున్న రోజు గ్రామంలో లేరు. ఈ రిపోర్టు చూసిన జనాలు షాక్‌కు గురయ్యారు. అసలు తాము ఎలాంటి శాంపిల్స్ ఇవ్వకుండానే పాజిటివ్ రిపోర్టులు రావడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం కాస్త సీరియస్ కావడంతో అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ సందర్భంగా గుమాన్ మాట్లాడుతూ.. ‘నేను శాంపిల్స్‌ని మార్చేశాను. ఓ 20 టెస్టింగ్ కిట్లను ల్యాబ్‌కు పంపాను. వాటిలో ఎలాంటి శాంపిల్స్ లేవు. వాటిని నీటిలో ముంచి టెస్ట్‌కు పంపాను’ అని తెలిపాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు గుమన్తో పాటు బ్లాక్ కమ్యూనిటీ మొబిలైజర్ బచ్చన్ ముజల్దా సర్వీసులను నిలిపివేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను పంపినట్లు ధార్ జిల్లా కలెక్టర్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. -
బాలాపూర్ సీఐపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎస్సై నరసింహను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరామర్శించారు. ప్రస్తుతం నరసింహ అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరసింహకు అపోలో వైద్యులు మెరుగైన చికిత్స అందిసున్నారని తెలిపారు. అయితే సీఐ సైదులు తనపై తప్పుడు రిపోర్టు ఇచ్చాడని నరసింహ ఆరోపించిన వ్యాఖ్యలను మేము పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు నరసింహ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయితే బాలాపూర్ సీఐ సైదులు, కానిస్టేబుల్ దశరథ్‌లను బదిలీ చేసి సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశామని తెలిపారు. తదుపరి విచారణలో వీరిద్దరి ప్రమేయం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒక కేసు విషయంలో తనకు సంబంధం లేకున్నా ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని నరసింహ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో 30 శాతం కాలిన గాయాలతో ఉన్న నరసింహను అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. ఇటీవల బాలాపూర్ సీఐ తనను వేధిస్తున్నాడంటూ అదే స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తున్న నరసింహ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని ఫిర్యాదును పట్టించుకోకుండా నరసింహను బాలాపూర్ నుంచి మంచాలకు ట్రాన్స్పర్ చేశారు. తన తప్పు లేకున్నా సీఐ ఇచ్చిన తప్పుడు రిపోర్టుతో తనను అక్రమంగా బదిలీ చేశారని మనస్థాపం చెందాడు. దీంతో శుక్రవారం నరసింహ పెట్రోల్ బాటిల్‌తో బాలాపూర్ పీఎస్‌కు చేరుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. -
అక్కడ పోటీ చేస్తే సీఎం గెలుపు అసాధ్యం?
యశవంతపుర : చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తే గెలవటం అసాధ్యమంటూ ఇంటెలిజెన్స్ విభాగం పేరుతోనున్న ఓ పత్రం వైరల్ కావడం సంచలనం రేగింది. అయితే ఇది నకలీ నివేదిక అని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఈ నివేదికపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీఐజీకి సూచించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కాగా, అలాంటి నివేదిక ఏదీ ఇంటెలిజెన్స్ వర్గాలు తమ కార్యాలయానికి ఇవ్వలేదని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. తమ విభాగం కన్నడలో మాత్రమే ఇస్తుందని, అయితే నివేదిక ఆంగ్లంలో ఉన్నందున అది నకిలీదని నిఘా అధికారులు ఖండించారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి (వరుణ), బసవకల్యాణ, గంగావతి, శివాజీనగర నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏలా ఉంటుందనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు గోప్యంగా నివేదిక చేయించారు. నాలుగు చోట్ల కూడా ఓడిపోతారంటూ నివేదిక శుక్రవారం రాత్రి నుండి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ నివేదికపై జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం సిద్ధరామయ్యపై పలు ఆరోపణలు చేశారు. అయన హుబ్లీలో విలేకర్లతో మాట్లాడారు. తను ఎక్కడ నుండి పోటీ చేయాలో సర్వే చేయించి అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కుమార ఆరోపించారు. నేడు ప్యాలెస్ మైదానంలో రాహుల్ సభ సాక్షి, బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించనుంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొ ంటారు. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ సభకు దీటుగా జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు. ఇందుకోసం మూడు వేలకు పైగా కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులను కేటాయించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు జ్ఞానభారతి ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని ప్యాలెస్ మైదానం చేరుకుని సభలో పాల్గొంటారు. -
ఐశ్వర్య ఆత్మహత్య; ఫేక్ న్యూస్ కలకలం
ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ వదంతుల బాధితుల జాబితాలో చేరారు. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆదివారం వార్తలు రావడంతో కలకలం రేగింది. కుటుంబ కలహాలతో ఐష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచారని ప్రచారం జరిగింది. ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణబీర్ కపూర్ సన్నిహితంగా నటించడంతో ఆమె కుటుంబంలో కలతలు రేగాయని కథ అల్లారు. ఐశ్వర్య ఆత్మహత్యాయత్నం చేయడంతో బచ్చన్ కుటుంబం డాక్టర్ ను పిలిపించిందని, అప్పటికే ఆమె చనిపోయిందని.. ఈ విషయాన్ని బయటకు రానీయలేదని ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. బ్లాగుల్లోనూ విపరీతంగా ట్రెండయింది. ఆదివారం అర్థరాత్రి ఓ పార్టీలో సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్ర తో కలిసి ఐశ్వర్య కనబడడంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, దిలీప్ కుమార్, హనీ సింగ్, రజనీకాంత్, లతా మంగేష్కర్ చనిపోయినట్టు గతంలో వదంతులు రేగిన సంగతి తెలిసిందే.