ఆ సీఎం మళ్లీ హాయిగా కునుకేశారు | Karnataka Cm sleeping while Press Conference is going on | Sakshi
Sakshi News home page

ఆ సీఎం మళ్లీ హాయిగా కునుకేశారు

Published Fri, May 26 2017 8:01 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

ఆ సీఎం మళ్లీ హాయిగా కునుకేశారు

ఆ సీఎం మళ్లీ హాయిగా కునుకేశారు

బెంగళూరు: ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ఎంచక్కా కునుకుతీశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ వేణుగోపాల్ మీడియా సమావేంలో మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ పక్కను కూర్చున్న సిద్ధరామయ్య మాత్రం ఇవేమీ తనకు పట్టవన్నట్లుగా హాయిగా నిద్రపోవడం చర్చనీయాంశమైంది. అయితే పలు ముఖ్య సందర్భాలలో ఆయన ఇలా నిద్రపోవడం ఇదేం తొలిసారి మాత్రం కాదు. సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.

2014లో కర్ణాటక అసెంబ్లీలో ఓ బాలికపై అత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనూ సీఎం గారు చక్కగా కునుకుతీసి విమర్శలపాలయ్యారు. గతంలో మైసూరులో జరిగిన ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103వ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ ఆయన చల్లగా, హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ శిష్యుడు అయిన సిద్దరామయ్య తన పాత గురువు లక్షణాలు కొన్ని వెంట తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పలు సమావేశాలలో మాజీ ప్రధాని దేవేగౌడ నిద్రపోవడం.. సమావేశం పూర్తయిన తరువాత నిద్రలేవడం అందరికి తెలిసిందే. అయితే సీఎం సిద్ధరామయ్యకు అతినిద్ర జాడ్యం ఉందని.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు యోగా చేస్తున్నారని ప్రచారంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement