మైసూరు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై మాత్రమే రాష్ట్ర సర్కార్ లోతుగా ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయిలో విస్తృతస్థాయిలో సంప్రతింపులు జరిపిన తర్వాతే ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శనివారం మైసూరులో మీడియాతో ఆయ మాట్లాడారు. ‘ హిజాబ్‌పై నిషేధాన్ని ఇంకా అమల్లోకి తేలేదు. ఈ విద్యాసంవత్సరంలోనే అమలుచేయాలా వద్దా అనే దానిపై ఇంకా సంప్రతింపులు కొనసాగుతున్నాయి’’ అని చెప్పారు.
కర్ణాటకవ్యాప్తంగా విద్యాలయాల్లో మతపరమైన వ్రస్తాలు ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవుకదా. అయినా ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి ఆహారం తినాలి అనేది పూర్తిగా వ్యక్తిగతం’’ అని శుక్రవారం వ్యాఖ్యలుచేసిన ఆయన మరుసటిరోజే ఇలా విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ చర్యల ఫలితంగా విద్యాసంస్థల్లోని లౌకక వాతావరణం దెబ్బతినే ప్రమాదముందని బీజేపీ ఆందోళనవ్యక్తంచేసింది. ‘‘ రాష్ట్రాల్లోని విద్యా వాతావరణాన్ని సీఎం చెడగొడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతున్నారు’’ అని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment