సీఎం చేతిలో మంత్రించిన నిమ్మకాయ !
మైసూరు: తన రాజకీయ ప్రస్థానంలో మూఢనమ్మకాలను నమ్మని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం నగరంలోని రామకృష్ణనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేతిలో నిమ్మకాయతో దర్శనమివ్వడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆయన పెద్ద కుమారుడు రాకేశ్ సిద్ధరామయ్య మృతితో పుత్రశోకం నుంచి బయటపడడానికి ఆయన కుటుంబంతో కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం నగరంలోని టీ.కే.లేఔట్‌లో తన స్వగృహంలో బస చేసిన సద్ధరామయ్య మంగళవారం మంత్రించిన నిమ్మకాయతో మీడియా సమావేశానికి హాజరుకాడంతో అందరిలోను ఆశ్చర్యం నెలకొంది.