ృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రిమండలి విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ...
ఎన్నికల తర్వాతే సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు : ృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రిమండలి విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేదని స్పష్టం చేశారు. బెంగళూరు, మైసూరులో గురువారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీని కలవడానికి అన్ని పార్టీల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులతో పాటు వివిధ పంటలకు సరైన మద్దతు ధర లభించిక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న వైనాన్ని కూడా ఈ భేటీలో ప్రధానమంత్రికి వివరించనున్నట్లు తెలిపారు.
కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారి నుంచి నీతి వ్యాఖ్యాలు వినాల్సిన దుస్థితి అధికార కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటు వాఖ్యలు చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫెరెండం కాదని విశ్లేషించారు.