నాడహళ్లి ఔట్ | Nadahalli out | Sakshi
Sakshi News home page

నాడహళ్లి ఔట్

Published Thu, Jul 23 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

నాడహళ్లి ఔట్

నాడహళ్లి ఔట్

బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తిరుగుబాట బావుటా ఎగురవేసిన విజయపుర జిల్లా దేవరహిప్పర్గీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎ.ఎస్ పాటిల్ నాడహళ్లిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కి సూచన రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఉత్తర కర్ణాటక అభివృద్ధి విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల నాడహళ్లి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ నిర్ధారించింది. ఫలితంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement