నేడు రాహుల్ రాక | Today Rahul arrival | Sakshi
Sakshi News home page

నేడు రాహుల్ రాక

Published Thu, Jul 23 2015 1:51 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

నేడు  రాహుల్ రాక - Sakshi

నేడు రాహుల్ రాక

సీఎంతో పాటు కేపీసీసీ అధ్యక్షుడితో సమావేశం
 
బెంగళూరు: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం బెంగళూరుకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఆయన ముందుగా బెంగళూరు చేరుకోనున్నారు.  గురువారం ఉదయం నగరంలోని కుమార కృపా అతిథి గృహంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్‌తో ఆయన సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వంతో పాటు పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలు తదితర అంశాలపై రాహుల్‌గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం అనంతరం రాహుల్‌గాంధీ అనంతపురానికి బయలుదేరి వెళ్లనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement