రాజమండ్రి: రైతుల ఆత్మహత్యలపై యాత్ర చేయడం రాహుల్‌గాంధీ రాజకీయ అవగాహన లేమిని చాటుతోందని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు ధ్వజమెత్తారు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 24వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం రాహుల్‌కు తెలియదా అని మంత్రి పుల్లారావు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చేసినందుకు ముందుగా తెలుగువారికి రాహుల్ క్షమాపణ చెప్పాలని కిశోర్‌బాబు, అచ్చెన్నాయుడు, రాఘవరావు డిమాండ్ చేశారు. చంద్రబాబును ఫారిన్‌బాబు అని రాహుల్ అభివర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం చేసిన లోటును పూడ్చేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని చెప్పారు.
రాహుల్‌ది అవగాహన లేమి
Published Sat, Jul 25 2015 9:39 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement