అప్పుడు ఎందుకు భరోసా ఇవ్వలేదు?
రాహుల్ రైతు భరోసా
యాత్రలపై కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్: తాము అధికారంలో ఉన్న పదేళ్లలో 3లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎందుకనిపించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు భరోసా పేరుతో దేశమంతా తిరుగుతూ రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీ యూపీఏ పాల నలో చోటుచేసుకున్న పరిణామాలు మరిచిపోయినట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం కిషన్‌రెడ్డి పార్టీ కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ తెలంగాణలో చేపట్టిన రైతు భరోసా యాత్రపై ధ్వజమెతా ్తరు. అధికారం కోల్పోగానే ప్రజలను, దేశాన్ని వదిలి.. పార్టీకి సెలవు పెట్టి వెళ్లిన రాహుల్‌గాంధీ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారని విమర్శించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21,810 మంది రైతులు పదేళ్ల యూపీఏ హయాంలో చని పోయినట్లు అప్పటి కేంద్రమం త్రి శరద్‌పవార్ రాజ్యసభలో వెల్లడించారని గుర్తు చేశారు. ఆ పదేళ్ల కాలంలో రాహుల్‌గాంధీ గానీ ఆయన తల్లి సోనియా గాంధీగానీ ఏనాడూ రైతులకు భ రోసా ఇవ్వలేద న్నారు. భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ బావ వాద్రాకు లక్షల కోట్ల విలువైన భూములను హర్యానా రాష్ర్టంలో అక్రమంగా కట్టబెట్టారని, ఉమ్మడి రాష్ట్రంలో విచ్చలవిడిగా భూపందేరాలు చేశారని అన్నారు.ఈ సమావేశంలో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.