పెట్టుబడులకు కర్ణాటక అనుకూలం | Suitable for investment to Karnataka | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు కర్ణాటక అనుకూలం

Published Thu, Aug 25 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

Suitable for investment to Karnataka

బెంగళూరు:  విమానయాన, శిక్షణ, యంత్రపరికరాల తయారీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కర్ణాటక ఉత్తమమైన రాష్ట్రంగా భారతదేశంలోని ఫ్రాన్స్‌రాయబారి అలెగ్జాండ్రియా ఝుగ్లర్ పేర్కొన్నారు. ఇక్కడి కృష్ణలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

పెట్టుబడుల విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ప్రాథమికంగా చర్చించామన్నారు. జనవరిలో తమ దేశపు పారిశ్రామిక వేత్తలతో కలిసి మరోసారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి వివిధ ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. తమకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement