సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పే ర్కొన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కోరమంగళలోని కేఎస్‌ఆర్పీ మైదానంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇందుకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
పోలీసుల సంక్షేమం కోసం ప్ర భుత్వం అనేక కార్యక్రమాలను రూపొం దిస్తోం దన్నారు. అందులో భాగంగా వారి పిల్లల కోసం ప్రత్యేకంగా త్వరలో గుల్బర్గా, ఉడిపిల్లో ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించనున్నామన్నారు. ఇలాంటి పాఠశాలలు ఇప్పటికే కోరమంగల, మైసూరు, ధార్వాడలో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీస్ క్యాంటీన్‌లోని సౌలభ్యాలను విశ్రాంత ఉద్యోగులకూ అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. కాగా, కార్యక్రమం లో భాగంగా పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన 85 మంది సిబ్బందికి ముఖ్యమంత్రి పతకాలను ప్రదానం చేశారు.
విద్రోహుల పీచమణుస్తాం
Published Fri, Apr 3 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement