stringent measures
-
మరింత కఠిన ఆంక్షలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ కవర్ల తయారీ, అమ్మకం, వినియోగంపై కేంద్రం మరింత కఠిన ఆంక్షలు విధిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో 50 మైక్రాన్ల మందం గల కవర్లను బ్యాన్ చేసినప్పటికీ మార్కెట్లో వినియోగం తగ్గలేదు. 75 మైక్రాన్ల మందం గల కవర్ల వినియోగానికి అనుమతినిచ్చారు. తక్కువ మందం గల కవర్లు పునర్ వినియోగానికి ఉపయోగపడకపోగా, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని భావించిన కేంద్రం వాటి స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, అంతకంటే ఎక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలకు జారీ చేసింది. చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే? మన రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు తయారు చేస్తున్న, అమ్ముతున్న కేంద్రాలపై మున్సిపల్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సరుకును సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివరికి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను బ్యాన్ చేస్తున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమల యజమానులు, హోల్‌సేల్ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు.. ఒక్కసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్.. ముఖ్యంగా హోటళ్లు, శుభకార్యాల్లో వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టేబుల్‌పై పరిచే షీట్లు వంటి వాటి వినియోగాన్ని జూలై 1 నుంచి పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులతో పాటు, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి వద్ద నమోదు చేసుకున్న 139 ప్లాస్టిక్ పరిశ్రమలు తక్కువ మందంగల క్యారీబ్యాగులను తయారు చేస్తుండటంతో వాటి లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. జూలై 1 నాటికి తమ వద్దనున్న సరుకును రీసైక్లింగ్‌కు పంపించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబర్ నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ తయారు చేస్తున్నవారిపైనా, స్టాకిస్టులపైన, ప్లాస్టిక్ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నవారిపైనా దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీఎత్తున ప్లాస్టిక్ కవర్లు, వినియోగ సరుకును సీజ్ చేయడమే కాకుండా రూ.1.54 కోట్ల పెనాల్టీ సైతం విధించారు. -
విద్రోహుల పీచమణుస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పే ర్కొన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కోరమంగళలోని కేఎస్ఆర్పీ మైదానంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇందుకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల సంక్షేమం కోసం ప్ర భుత్వం అనేక కార్యక్రమాలను రూపొం దిస్తోం దన్నారు. అందులో భాగంగా వారి పిల్లల కోసం ప్రత్యేకంగా త్వరలో గుల్బర్గా, ఉడిపిల్లో ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించనున్నామన్నారు. ఇలాంటి పాఠశాలలు ఇప్పటికే కోరమంగల, మైసూరు, ధార్వాడలో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీస్ క్యాంటీన్లోని సౌలభ్యాలను విశ్రాంత ఉద్యోగులకూ అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. కాగా, కార్యక్రమం లో భాగంగా పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన 85 మంది సిబ్బందికి ముఖ్యమంత్రి పతకాలను ప్రదానం చేశారు. -
సహకరించని మంత్రులపై కఠిన చర్యలు
► కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ► పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొనాల్సిందే సాక్షి, బెంగళూరు : పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో సహకరించని మంత్రులు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)అధ్యక్షుడు పరమేశ్వర్ హెచ్చరించారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కోటి మందిని సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందన్నారు. బూత్‌స్థాయి నమోదు వంటి సంప్రదాయ విధానాలతో పాటు అన్లైన్, మొబైల్ తదితర అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించుకుంటూ సభ్యత్వ నమోదులో చురుకుగా వ్యవహరిస్తోందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామన్నారు. రాష్ట్ర పరిస్థితిని గమనించిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాం ధీ సభ్యత్వ నమోదుకు మరో రెండు నెలలు గడువు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, మండళ్ల అధ్యక్షుల పోస్టులను దక్కించుకున్న వారు సభ్యత్వ నమోదుపై ఎక్కువ దృష్టి సారిం చాలని సూచించారు. తానే స్వయంగా ప్రతి నియోజక వర్గానికి వచ్చి సభ్యత్వ నమోదు విషయమై సమీక్ష జరుపుతానని తెలిపారు. అంతేకాకుండా సభ్యత్వ నమోదు కార్యక్ర మ పరిశీలన కోసం నాలుగు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తమ పరిశీలనలో సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించనట్లు తేలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇకపై కాంగ్రెస్ తరఫున మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎంపికయిన వారి కి కనిష్టంగా వారం పాటు ఘటప్రభలో పార్టీ శిక్షణ కేంద్రంలో పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణకు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయం పార్టీ పదాథికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పరమేశ్వర్ తెలిపారు. న్యాయపోరాటం తప్పదు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెలాఖరులోపు బెంగళూరులోని జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకు అప్పగించకుంటే న్యాయపోరాటం తప్పదన్నారు. ఆ పార్టీ నాయకులే స్వయంగా కార్యాలయాన్ని ఖాళీ చేస్తే హుందాగా ఉంటుందని పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. సామాజిక వేత్తగా అభివర్ణించుకునే హీరేమఠ్ రాష్ట్ర మంత్రులను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని పరమేశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. అతనిదగ్గర సరైన ఆధారాలు ఉంటే లోకాయుక్తకు అందించి దర్యాప్తు కోరవచ్చుకదా? అని మీడియా అడిగిన ఓప్రశ్నకు పరమేశ్వర్ సమాధానమిచ్చారు. -
కూలీలకు ‘ఉపాధి' కల్పించండి
కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఆదేశం అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలందరికీ పనులు కల్పించాలని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఉపాధిహామీ పథకం అమలుపై ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలతో టీటీడీసీలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పనుల కల్పన నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది గణనీయంగా కూలీల హాజరుశాతం తగ్గిపోయిందని అన్నారు. ఇందుకు గల కారణాలపై ఆయన ఆరా తీశారు. వెంటనే ప్రతి మండలంలోనూ కూలీల శాతం మెరుగుపడాలన్నారు. పనుల వివరాలను రికార్డుల్లో పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. మెట్టభూముల్లో పండ్లతోటల పెంపకం చేపడుతున్న రైతుల భూముల్లో తప్పనిసరిగా ఫారం పాండ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ 5 వేల మంది రైతుల నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు. మిగిలిన రైతుల నుంచి ప్రతిపాదనలను పంపాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన మరమ్మతు పనులకు సంబంధించి గ్రామపంచాయతీ, మండ ల పరిషత్‌ల నుంచి తీర్మానాలను పంపాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత కోసం ఎంపీడీఓలు కృషి చేయాలన్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవ త్సరాలలోపు ఉన్న నిరక్షరాస్యులను గుర్తించాలని ఆదేశించారు. వారికి విద్యనందించేందుకు వయోజనవిద్య శాఖ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ నాగభూషణం, ఏపీడీలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.