
ఆకలి రహిత కర్ణాటక లక్ష్యం
సీఎం సిద్ధరామయ్య
అన్నభాగ్యతో 4 కోట్ల మందికి {పయోజనం
రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోండి
ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుల ఆహ్వానం
జూన్ 1 నుంచి ఏపీఎల్ కార్డుదారులకు దేషన్
బెంగళూరు: ఆకలి రహిత కర్ణాటకను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బీపీఎల్ కార్డుదారులకు చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన విధానసౌధ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్నభాగ్య పథకం వల్ల రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఈ పథకం కోసం వరి, రాగి, గోదుమలకు కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. దీని వల్ల రైతులకు కూడా లాభం చేకూరుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం జనాభాలో 21 శాతం మంది దారిద్ర రేఖకంటే దిగువన ఉన్నారని తెలిపారు. తమిళనాడులో ఈ సంఖ్య 17 శాతం, కేరళలో 12 శాతంగా ఉందని వివరించారు. అయితే కర్ణాటకలోని మొత్తం జనాభాల్లో 23.6 శాతం మంది దారిద్రరేఖ కంటే దిగువన ఉన్నారని తెలిపారు.
వీరందరికీ పౌష్టికాహారం దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఉచితంగా ఆహారధాన్యాలను, రాయితీ ధరల్లో వంటనూనె, ఉప్పును అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నూతనంగా ఏపీఎల్ లేదా బీపీఎల్ కార్డు పొందాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఏపీఎల్ కార్డుదారులకూ రాయితీ ధరల్లో బియ్యం, గోదుమలను రేషన్ షాపుల ద్వారా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రేషన్‌కార్డులను వితరణ చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ రేషన్‌కార్డులను అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు రామలింగారెడ్డి, కే.జే జార్జ్ తదితరులు పాల్గొన్నారు.