అక్రమాలకు పాల్పడి ఉంటే... నా బిడ్డను ఉరి తీస్తా!
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
ఆధారాలుంటే చూపండంటూ విపక్షాలకు సవాల్
బెంగళూరు : ‘నిబంధనలకు విరుద్ధంగా ఇసు క తవ్వకాలు, రవాణాలో తన కుమారుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడి ఉన్నా అతన్ని ఉరి తీస్తా’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేశంగా అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో సిద్దు కుమారుడితో పాటు మంత్రి మహదేవప్ప కుమారుడు హస్తముందంటూ బీజేపీ నేత కె.ఎస్.ఈశ్వరప్ప ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీఎం స్పందించారు. మైసూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని విపక్ష నేతలకు హితవు పలికారు. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు వల్ల రూ. 3,800 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ విషయాలకు సంబంధించిన నివేదికను రాష్ట్ర వ్యవశాఖ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడతో కూడినృబందం మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందజేయనుందని తెలిపారు. రాష్ర్టంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిన వెంటనే సహకార, ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాలను బేషరత్తుగా మాఫీ చేస్తానని సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడిన యడ్యూరప్ప ఇప్పటికే జైలు జీవితం అనుభవించారని, అలాంటి వారి నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని మండిపడ్డారు.