టార్గెట్ | target | Sakshi
Sakshi News home page

టార్గెట్

Published Fri, Jul 10 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

టార్గెట్

టార్గెట్

సిద్ధుపై అధికార పార్టీలో పెల్లుబుకుతున్న అసంతృప్తి
రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ శక్తిని సృష్టించే దిశగా
‘అంబి’కి మద్దతిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలు

 
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సిద్దు పై నిరసన గళాన్ని వినిపించిన రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌కు వీరంతా మద్దతునిస్తున్నట్లు సమాచారం.
  - సాక్షి, బెంగళూరు
 
రాష్ట్రంలో సిద్ధరామయ్యకు పోటీగా నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు గాను అంబరీష్‌ని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ, ప్రభావవంత ఎమ్మెల్యేలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి నియోజక వర్గాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నియోజకవర్గాల్లో తమ ప్రభావం తగ్గిపోవడమే కాకుండా పార్టీలో తమ మనుగడ కొనసాగడం కూడా కష్టమనే భావన చాలా కాలంగా వీరిలో ఉండిపోయింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన నేతగా ఉండడం, ఆయనకు ప్రత్యామ్నాయ శక్తిగా వ్యవహరించగల నేత రాష్ట్ర శ్రేణుల్లో లేకపోవడంతో పాటు పార్టీ హైకమాండ్ మద్దతు కూడా సిద్దరామయ్యకు ఉండడంతో వీరంతా ఇన్ని రోజులు మిన్నకుండిపోయారు.

ఒకానొక సందర్భంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్పను రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించే ప్రయత్నం కూడా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలదృష్ట్యా శామనూరు శివశంకరప్ప వెనక్కు తగ్గడంతో  అసంతృప్తి ఎమ్మెల్యేలం తా మళ్లీ సిద్ధరామయ్య నే అనుసరించక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఎలాంటి విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి అంబ రీష్ ఘాటుగా లేఖ రా యడంతో ఈ అసృతప్త ఎమ్మెల్యేలం తా మరోసారి సిద్ధుకు ప్రత్యామ్నాయాన్ని వెతికే పని లో పడిపోయారు. నేరు గా సిద్ధరామయ్యను ఎదిరించలేని అసృతప్త ఎమ్మెల్యేలంతా ఇప్పుడిక అంబ రీష్ ద్వారా తమ అసృతప్తిని వెల్లగక్కేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకే అంబరీష్‌కు ఫోన్ చేసి తమ మద్దతును తెలుపుతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులృదష్ట్యా అంబరీష్‌ను రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయంగా ప్రతిబిం బించి, అదే విషయాన్ని హైకమాండ్‌కు కూడా చేరవేయాలని వీరంతా భావిస్తున్నారు. తద్వారా సిద్దరామయ్యను ఇరకాటంలో పడేయడంతో పాటు వీలైతే ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి సైతం తప్పించాలనేది ఈ అసృతప్త ఎమ్మెల్యేల వ్యూహంగా తెలుస్తోంది.

 మిమ్మల్ని వదులుకోబోము.....
 ఇక అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నేరుగా లేఖ రాసి, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా బెంగళూరు వచ్చేసిన మంత్రి అంబరీష్‌తో సిద్ధరామయ్య ఫోన్‌లో మాట్లాడారు. ‘మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు. అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. బోర్డు సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం ద్వారా మీకు ఇబ్బంది కలిగి ఉంటే మరోసారి బోర్డు సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, డెరైక్టర్ ఎంపికను నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను’ అని సీఎం మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.
 
రాజీనామా కాదు...
 సాక్షి, బెంగళూరు: తన రాజీనామాపై మంత్రి అంబరీష్ నోరు విప్పారు. గురువారం రాత్రి ఏడు గంటలకు జేపీ నగర్‌లోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడు తూ... ‘నాకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రూపం లో తెలిపాను. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కాదు. రాజకీయాల్లో ఎవరికైనా తన వాళ్లంటూ కొంత మంది ఉంటారు. అదే విధంగా నాకు కూడా శ్రేయోభిలాషులున్నారు. వారికి సరైన స్థానాలను కల్పించాలన్నదే నా ఆరాటం. ఈ విషయాన్నే నేను లేఖలో వెల్లడించాను.’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement