
నేపాల్ బాధితులకు ఏడాది వేతనం
శాసనమండలి సభ్యుడిగా తన ఏడాది వేతనాన్ని నేపాల్ భూకంప బాధితులకు అందజేయనున్నట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు.
బెంగళూరు: శాసనమండలి సభ్యుడిగా తన ఏడాది వేతనాన్ని నేపాల్ భూకంప బాధితులకు అందజేయనున్నట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రిమండలి పునఃరచనతో పాటు విస్తరణ కూడా ఉంటుందని తెలిపారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చేనెల 13కు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ఉత్తర కర్ణాటక భాగంలో ృహత్ సమావేశం జరిపే ఆలోచన ఉందని తెలిపారు.