బెంగళూరు: రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈమేరకు రాష్ట్రంలో మొట్టమొదటి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణ పనులను సిద్ధరామయ్య మంగళవారం యలహంకలోప్రారంభించారు. అనంతర మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడ్లగి, బళ్లారి, యరమరస్ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించనున్నుట్లు వెల్లడించారు.
రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి డీ.కే.శివకుమార్ మాట్లాడతూ....రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కష్టాలను తీర్చడానికి,ముఖ్యంగా రైతులకు నిరంతర విద్యుత్‌ను అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం యలహంకలో 370మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పావగడలో 12వేల ఎరకాల్లో 2వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించడానికి ఏర్పాట్లు శరవేంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100తాలూకాలలో 20మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడానికి ప్రమయత్నిస్తున్నామని తెలిపారు.