కోల్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఓకే
కేంద్ర, రాష్ట్ర పీఎస్‌యూలకు నేరుగా గనుల కేటాయింపునకు అవకాశం
ఈ-ఆక్షన్‌తో ప్రైవేటు కంపెనీలకు చాన్స్
4 నెలల్లో పరిస్థితి చక్కదిద్దుతావున్న అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: విద్యుత్ రంగం సంస్కరణల్లో భాగంగా కేంద్రప్రభుత్వం మరో ముందడుగువేసింది. అవకతవకల కారణంగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుతో కేటాయింపులు రద్దయిన 214 బొగ్గు బ్లాకులను ఈ-ఆక్షన్ ద్వారా వేలంవేయూలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం సోవువారం ఆమోదం తెలిపింది. బొగ్గు బ్లాకులను ప్రైవేటు కంపెనీలకోసం వేలం వేసేందుకు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రభుత్వ రంగం సంస్థ(పీఎస్‌యూ)లకు నేరుగా కేటాయించేందుకు వీలుగా మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
అవకతవకలు జరిగాయున్న కారణంతో 1993నుంచి వివిధ కంపెనీలకు కేటాయింపులు జరిపిన 218 బొగ్గు బ్లాకుల్లో 214 బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గత నెలలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు మంత్రివర్గం నిర్ణయుం తీసుకున్నట్టు కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
ఈ నిర్ణయుంతో ప్రభుత్వ రంగం అవసరాలను నెరవేర్చవచ్చని, జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్టీపీసీ)సహా, పలు పీఎస్‌యూలకు, వివిధ రాష్ట్రాల విద్యుత్ బోర్డులకు బొగ్గు గనులను కేటాయించేందుకు వీలుకలుగుతుందని చెప్పారు. సిమెంట్, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి రంగాలలో బొగ్గును వినియోగిస్తూ, బొగ్గుగనులకోసం దరఖాస్తు చేసుకునే ప్రైవేటు కంపెనీలకోసం గనులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు ఈ ఆర్డినెన్స్ దోహపడుతుందన్నారు. వేలం ప్రక్రియు మూడునెలలనుంచి నాలుగు నెలల వ్యవధిలోగా పూర్తి అవుతుందని, గనులు ఉంటున్న ప్రాంతానికి చెందిన ఆయూ రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రక్రియు జరుగుతుందని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం ఏటా దిగువుతి చేసుకుంటున్న రూ.122.27కోట్ల బొగ్గును ఈ చర్యద్వారా దేశంలోనే భర్తీ చేయువచ్చని అన్నారు.
ఆరోపణలున్న కంపెనీలను అనువుతించం
అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్న కంపెనీలపై తప్పనిసరిగా నిషేధం ఉంటుందని బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. గనుల వాణిజ్య వినియోగంకోసం 1973సంవత్సరపు బొగ్గు గనుల జాతీయూకరణ చట్టాన్ని సవరిస్తామన్నారు.
పలు రాష్ట్రాలకు ప్రయోజనం
బొగ్గు బ్లాకుల వేలంపై ఆర్డినెన్స్‌కోసం తీసుకున్న తాజా చర్యతో జార్ఖండ్, ఒడిశా, పశ్చివు బెంగాల్, చత్తీస్‌గఢ్ ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్, వుహారాష్ట్ర, వుధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని జైట్లీ చెప్పారు. బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న తూర్పు రాష్ట్రాలు ఆర్థికంగా వురింత బలపడతాయుని, లక్షలాది వుంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. బొగ్గు బ్లాకులపై ఆర్డినెన్స్ జారీకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయుంపట్ల బీజేపీ సోవువారం హర్షం వ్యక్తంచేసింది.