అనంతపురం శ్రీకంఠం సర్కిల్: టీడీపీ అధిష్టానం జేసీ వర్గానికి ఝలక్ ఇచ్చింది. బుధవారం రాత్రి ప్రకటించిన పార్టీ అనంతపురం పార్లమెంటు కమిటీలో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ‘రాయలసీమ ప్రాజెక్టులపై సీమ నేతల సదస్సు’లో పురుడుపోసుకున్న విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదని సదస్సులో జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు)
మంగళవారం కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇదే విషయాన్ని మరోసారి తేల్చిచెప్పారు. దీంతో అనంత టీడీపీ నేతలు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. రెండు నెలల క్రితమే వేసిన పార్లమెంట్ కమిటీని రద్దు చేసి బుధవారం రాత్రి ఆఘమేఘాలపై కొత్త కమిటీని నియమించింది. ఇందులో జేసీ వర్గానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అధ్యక్షునిగా, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ చౌదరిని ప్రధాన కార్యదర్శిగా 40 మందితో కమిటీని ప్రకటించింది. ఇందులో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. వారు కూడా ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నవారేనని, జేసీ వర్గంతో సంబంధం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి:
అబద్ధాల్లో అపూర్వ సోదరులు
Comments
Please login to add a commentAdd a comment