వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి | Clash Between YSRCP And TDP Activists In Anantapur District, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి

Published Tue, Dec 31 2024 5:46 AM | Last Updated on Tue, Dec 31 2024 9:15 AM

Clash between YSRCP and TDP activists in Anantapur district

మారణాయుధాలతో విరుచుకుపడిన పచ్చ మూక

గుంతకల్లు మండలం చింతలాంపల్లిలో ఘటన

గుంతకల్లు రూరల్‌: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం చింతలాంపల్లిలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్య­కర్తల ఇళ్లలోకి చొరబడి కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి­కి తెగబడ్డారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మల్లికార్జున, కదిరప్ప, వన్నూరప్ప, రుద్రమ్మ­లకు గాయాలయ్యాయి. వీరిలో మల్లికార్జున పరి­స్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక వ్యక్తికి, టీడీపీకి చెందిన మరో వ్యక్తికి మధ్య కొన్నేళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చా­క రాజకీయ పలుకుబడితో స్థల వివాదాన్ని పరి­ష్కరించుకునేందుకు టీడీపీ వర్గీయులు పావులు కదుపుతూ వచ్చారు.

అందులో భాగంగా ఈ నెల 24న రెవెన్యూ సిబ్బందితో వివాదాస్పద స్థలంలో సర్వే కూడా చేయించారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ వర్గీయులు, వారి ఇళ్ల­కు వచ్చే బంధువులపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు సైతం నిత్యం వైఎస్సార్‌­సీపీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించడం, కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కాగా.. సోమ­వారం రాత్రి టీడీపీ నాయకులు ఆనంద్, సుధీర్, సురేష్, వేణు, మరికొందరు వైఎస్సార్‌­సీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి మారణా­యు­ధాలతో విచక్షణార­హి­తంగా దాడికి పాల్పడ్డా­రు. ఈ దాడిలో మల్లి­కా­ర్జున తలకు తీవ్రగాయా­లు కాగా.. కదిరప్ప, వ­న్నూ­రప్ప, అతని భార్య రద్రమ్మ గాయపడ్డారు. వీరిని గుంతకల్లు ప్రభు­త్వ ఆస్పత్రికి తరలించే­లోపే దాడి చేసిన టీడీపీ నేతలు తమ­పైనా దాడి జరిగిందంటూ ఆస్పత్రిలో ప్రత్యక్షమ­య్యారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన
దాడి విషయం తెలు­సు­కున్న వైఎస్సార్‌సీపీ నా­య­కుడు మంజునా­థ్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధా­న కార్యదర్శి రామ­లింగ, మున్సిపల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు సుంకప్పతో పాటు కార్యక­ర్త­లు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి ముందు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. చింతలాంపల్లిలో ఆరు రోజులుగా టీడీపీ నేతలు దౌర్జన్యం సాగిస్తున్నా పోలీసులు మిన్నకుండిపో­తు­­న్నారని, వైఎస్సార్‌సీపీ కార్యక­ర్త­లపై మాత్రం అన్యాయంగా కేసులు బనాయి­స్తున్నా­రన్నారు. వై­ఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దా­డికి పాల్పడిన వారి­పై చర్యలు తీసుకునే దాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశా­రు. దాడులకు పాల్ప­డిన వారిపై చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement