clash between two groups
-
టీడీపీ, జనసేన బాహాబాహి
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా గురువారం రాత్రి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలోని డీలర్‌షిప్‌ల వాటాల విషయంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద గుమిగూడారు.నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్న నిత్యావసర సరుకుల దుకాణాల డీలర్‌షిప్‌లను తొలగించి తమకు ఇవ్వాలని, ఈ విషయంపై తమ అధినేతలు జిల్లా కలెక్టర్, ఆ శాఖ మంత్రిని ఆదేశించారంటూ బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలానా డీలర్షిప్ తమకు కావాలంటే తమకు కావాలని రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆదోని టూటౌన్ పోలీసులు అక్కడకు వచ్చి రెండువర్గాలకు సర్ధిచెప్పి శాంతింపచేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి
గుంతకల్లు రూరల్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం చింతలాంపల్లిలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి కొడవళ్లు, గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మల్లికార్జున, కదిరప్ప, వన్నూరప్ప, రుద్రమ్మలకు గాయాలయ్యాయి. వీరిలో మల్లికార్జున పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన ఒక వ్యక్తికి, టీడీపీకి చెందిన మరో వ్యక్తికి మధ్య కొన్నేళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ పలుకుబడితో స్థల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టీడీపీ వర్గీయులు పావులు కదుపుతూ వచ్చారు.అందులో భాగంగా ఈ నెల 24న రెవెన్యూ సిబ్బందితో వివాదాస్పద స్థలంలో సర్వే కూడా చేయించారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీ వర్గీయులు, వారి ఇళ్లకు వచ్చే బంధువులపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు సైతం నిత్యం వైఎస్సార్సీపీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం, కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కాగా.. సోమవారం రాత్రి టీడీపీ నాయకులు ఆనంద్, సుధీర్, సురేష్, వేణు, మరికొందరు వైఎస్సార్సీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మల్లికార్జున తలకు తీవ్రగాయాలు కాగా.. కదిరప్ప, వన్నూరప్ప, అతని భార్య రద్రమ్మ గాయపడ్డారు. వీరిని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే దాడి చేసిన టీడీపీ నేతలు తమపైనా దాడి జరిగిందంటూ ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారు.వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళనదాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు మంజునాథ్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలింగ, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సుంకప్పతో పాటు కార్యకర్తలు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి ముందు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. చింతలాంపల్లిలో ఆరు రోజులుగా టీడీపీ నేతలు దౌర్జన్యం సాగిస్తున్నా పోలీసులు మిన్నకుండిపోతున్నారని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మాత్రం అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే దాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. -
చిత్తూరులో టీడీపీ నేతల మధ్య స్థల వివాదం
-
మచిలీపట్నంలో శక్తి పటాల ఊరేగింపులో ఘర్షణ
-
టీడీపీ, జనసేన మధ్య బిగుస్తున్న ‘సీటు’ముడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య పడిన ‘సీటు’ముడి రోజురోజుకూ బిగుసుకుపోతోంది. రెండు పార్టీల మధ్య రాజకీయ కాక తారస్థాయికి చేరగా.. ఇరుపార్టీల నేతల మధ్య సిగపట్లు పెరిగాయి. ఉభయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పర మాటల యుద్ధంతో రచ్చకెక్కుతున్నారు. నరసాపురం టికెట్ తమదంటే.. తమదంటూ అనుకూల సమీకరణాలు చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీతో దోస్తీ ప్రకటించిన నాటినుంచి నియోజకవర్గంలో రెండు పార్టీలూ కలిసికట్టుగా నిర్వహించిన కార్యక్రమాలు లేకపోగా.. తాజా పరిణామాలు ఆ పార్టీల మధ్య మరింత దూరం పెంచుతోంది. జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి నలుగురు టికెట్లు ఆశిస్తూ వర్గాలుగా విడిపోయి హంగామా సృష్టిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. తాజా పరిణామాలతో టీడీపీ కార్యక్రమాలకు జన సైనికులు దూరం జరగ్గా.. జన సైనికులతో అంతకంటే ఎక్కువగా టీడీపీ దూరం పాటిస్తోంది. మింగుడు పడని రాజకీయం రాష్ట్రంలోనే అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. రాజకీయ పరంగా ప్రతిపక్షాలకు ఆదినుంచీ కొరుకుడుపడని విధంగానే ఉంటోంది. ఇప్పుడు కూడా సీటు విషయంలో గందరగోళం నెలకొని టీడీపీ, జనసేన పార్టీలకు మింగుడుపడటం లేదు. రెండు పార్టీలకు కనీస స్థాయిలో కూడా బలమైన ఇన్చార్జిలు లేకపోవడం, ఆశావహులు ఎక్కువగా ఉండటం, కుల సమీకరణాలు కీలక ప్రాధాన్యంగా మారడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 1983 నుంచి 2004 వరకు నరసాపురంలో టీడీపీ గెలుపొందుతూ వచ్చింది. 2009లో ముదునూరి ప్రసాదరాజు గెలుపొందారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్ ప్రభంజనంలో ఘన విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. పూర్తిగా పాజిటివ్ పాలిటిక్స్‌తో అర్థరహిత విమర్శలకు పోకుండా నియోజకవర్గంలో గడచిన నాలుగేళ్ల 9 నెలల కాలంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు నిర్వహించారు. మొదటినుంచీ ఆయన జనంలో బలంగా తిరుగుతున్నారు. ప్రసాదరాజు అన్నివర్గాలనూ కలుపుకుపోతూ నానాటికీ బలపడుతుండటంతో టీడీపీ, జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత ఎన్నికల్లో రెండో స్థానం వచ్చినా.. 2019 ఎన్నికల్లో జనసేన ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీని మూడో స్థానంలోకి నెట్టి దాదాపు 35 ఏళ్ల టీడీపీ రాజకీయ ప్రస్థానానికి జనసేన గండి కొట్టింది. నాటినుంచి నేటివరకు నియోజకవర్గంలో టీడీపీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,120 ఓట్లు సాధించగా.. టీడీపీ దారుణంగా పతనమై 27,059 ఓట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో పొత్తు లేకుండానే అత్యధిక ఓట్లు సాధించాం కాబట్టి పొత్తుల్లో పవన్ కల్యాణ్ కంటే ముందు నరసాపురం సీటును జనసేన పార్టీకే ప్రకటిస్తారని జనసేన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాతోపాటు బహిరంగంగానూ బలంగా వాణి వినిపిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ పనైపోయిందంటూ జనసేన కార్యకర్తలు టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు, సమన్వయ కమిటీ కార్యక్రమాలకు, చంద్రబాబు పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. టీడీపీ సైతం జనసేనతో ఇదే దూరం పాటిస్తోంది. టీడీపీలో టికెట్ లొల్లి టీడీపీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో గందరగోళం నెలకొంది. నలుగురు అభ్యర్థులు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న కొద్దిపాటి కేడర్‌ను చెల్లాచెదురు చేస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది.. 2019లో ఓడిపోయిన బండారు మాధవనాయుడును టీడీపీ ఇన్చార్జిగా తొలగించి అత్యంత మొక్కుబడి నాయకుడైన పొత్తూరు రామరాజును ఇన్చార్జిగా నియమించింది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి వేర్వేరుగా అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా.. టీడీపీ సీటు ఆశిస్తూ ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్నాయుడు కొద్ది నెలలుగా నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారు. నరసాపురం సీటు జనసేనకు కేటాయించడం లేదని.. టీడీపీకి చెందిన ముగ్గురికీ కాకుండా తనకే వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సొంత అజెండాతో ప్రతిచోటా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక అపార అనుభవం ఉండి.. అన్ని రాజకీయ పార్టీలూ తిరిగి వచ్చిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ టికెట్ కోసం విపరీతంగా లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా చంద్రబాబు తనకే సీటిస్తానని చెప్పారంటూ హడావుడి చేస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేనలోనూ గందరగోళమే మరోవైపు అభ్యర్థి ఎవరనే విషయంలో జనసేన పార్టీలోనూ గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్‌కు ఈసారి ఆ పార్టీ నుంచి సీటొస్తుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. టీడీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ టికెట్ కోసం కూడా కరీ్చప్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా నరసాపురం జనసేన సీటు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఆక్వా వ్యాపారి చాగంటి మురళీకృష్ణ కూడా జనసేన టికెట్‌పై కన్నేశారు. -
జనసేన నేతల కొట్లాట..!
-
పెన్సిల్వేనియా తానా సభల్లో తన్నులాట
-
కామారెడ్డిలో కాసేపు హైటెన్షన్.. రైతులు, BRS నేతల మధ్య వాగ్వాదం
-
Lunar Eclipse: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి?
సాక్షి, భువనేశ్వర్: దేశవ్యాప్తంగా మంగళవారం చంద్రగ్రహణం కనువిందుచేసింది. ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించగా.. కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. కొందరు అనాదిగా వస్తున్న కొన్ని ఆచారాలను పాటించగా, మరికొందరు వాటిని లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో రెండో చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజధాని భువనేశ్వర్‌లోని లోహియా అకాడెమీలో హేతువాద వర్గం నేడు (చంద్రగ్రహణం) బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించింది. విషయం తెలుసుకున్న సంప్రదాయవాదులు అక్కడకు చేరుకుని చంద్రగ్రహణం రోజున వండిపెట్టిన ఆహారాన్ని తినడమేంటని అభ్యంతరం తెలిపారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మంటగలుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో బిర్యానీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నవారిపై సంప్రదాయవాదలు దాడికి పాల్పడ్డారు. హేతువాదులపై ఆవుపేడ, రాళ్లతో దాడి చేశారు. (చదవండి: Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లాఠీలకు పనిచెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెర్హాంపూర్లోనూ ఇలాంటి వెలుగుచూసింది. బిర్యానీ ఫెస్టివల్ నిర్వహణను సంప్రదాయవాదులు అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది. సంప్రదాయవాదులు అంటున్నట్టుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని స్వీకరిస్తే చెడు ప్రభావాలేమీ ఉండవని హేతువాదులు చెప్తున్నారు. అర్థంలేని ఆచారాలను పాటించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి సూర్యగ్రహణం రోజున కూడా భువనేశ్వర్‌లో సంప్రదాయవాదులు, హేతువాదుల మధ్య బిర్యానీ పంచాయితీ వివాదానికి దారితీసింది. (చదవండి: చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..) -
ఫారెస్ట్ అధికారులు ,పోడు రైతులకు మధ్య ఘర్షణ
-
ఎగిరిన రాళ్లు.. విరిగిన కర్రలు.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో స్థానిక బీజేపీ శ్రేణులు బాణసంచాలు కాలుస్తూ ఘనస్వాగతం పలికాయి. అక్కడ స్వరాజ్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో బండి సంజయ్ మాట్లాడారు. నాటి నిజాం సర్కారు, నేటి కేసీఆర్ పాలన తీరును ఎండగట్టారు. రెండువర్గాల వారు పరస్పరం తలపడ్డారు. కంకర రాళ్లు ఎగిరి పడగా, జెండా కర్రలు విరిగేలా కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వారితో పాటు సభకు వచ్చిన ఓ సాధారణ మహిళ సత్తెమ్మ.. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి లాఠీలకు పనిచెప్పారు. ఈ సంఘటన దేవరుప్పుల చౌరస్తా వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. డీజీపీకి సంజయ్ ఫోన్ ఈ సంఘటనపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఫోన్ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడుతూ, వరంగల్ సీపీ.. మంత్రి దయాకర్‌రావుకు గుత్తేదారుగా తయారు కావడం వల్లే తమ యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నా యని ఫిర్యాదు చేశారు. పోటాపోటీ ధర్నాలు అనంతరం బండి సంజయ్ యాత్ర దేవరుప్పుల నుంచి ధర్మాపురానికి బయలుదేరింది. యాత్ర వెళ్లాక తమ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు పలువురు బీజేపీ నాయకుల కార్ల అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలో బీజేపీ మహిళ మోర్చా మేడ్చల్ జిల్లా నాయకురాలు హైమారెడ్డి, సుధారాణి, సులోచనలు వాహనంలో వస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అద్దాలు పగులగొట్టారు. దీనికి నిరసనగా సూర్యాపేట రహదారిపై నాలుగు గంటలపాటు ధర్నాకు దిగారు. 500 మంది గూండాలతో యాత్ర: ఎర్రబెల్లి బండి సంజయ్ 500 మంది గూండాలతో యాత్ర చేస్తూ, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, రాళ్లు, కర్రలతో దాడి చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. దేవరుప్పులలో గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్తలు జనగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంత్రి.. నాయకులతో కలిసి పరామర్శించారు. చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం -
బాగల్కోట్లో చెలరేగిన హింస..ముగ్గురికి కత్తిపోట్లు
సాక్షి,బెంగళూరు: కర్ణాటక బాగల్‌కోట్‌లోని కెరూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ అల్లర్లలో ఓ వర్గానికి చెందిన ముగ్గురిని కత్తులతో పొడిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ సమయంలో ఇరువర్గాల వారు ఆగ్రహంతో అక్కడున్న దుకాణాలు, ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. పండ్లు, కూరగాయల బండ్లను కూడా తగలబెట్టారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లతో గాయపడిన ముగ్గురూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు చెందిన 18 మందిని అరెస్టు చేశారు. నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కెరూర్ ప్రాంతంలో గురువారం ఉదయం 8గంటల వరకు 144 సెక్షన్ విధించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే కొంతమంది యువకులు బస్టాండ్‌లో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. వారిని చూసిన మరో వర్గం వారు ఆగ్రహించడం గొడవకు దారితీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో హిందూ జాగరణ్ వేదికకు చెందిన ముగ్గురిని మరో వర్గం వారు పొడిచినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం అల్లర్లకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టినట్ల పేర్కొన్నారు. -
బాలయ్య జన్మదిన వేడుకల్లో తెలుగు తమ్ముళ్ల రచ్చరచ్చ
ములకలచెరువు: ములకలచెరువులో సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణ జన్మదిన వేడుకలను రెండు వర్గాలుగా వేర్వేరుగా జరపడం రచ్చకెక్కింది. ముందుగా నియోజకర్గ ఇన్చార్జ్ శంకర్‌యాదవ్ వర్గీయుడు మండల పార్టీ కన్వీనర్ పాలగిరి సిద్దా ఆధ్వర్యంలో కేకు కట్‌చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇంతలో బి.కొత్తకోటకు చెందిన సీనియర్ నాయకురాలు పర్వీన్‌తాజ్, పీటీయం మండలానికి చెందిన తలారి మంజునాథ్ మరి కొందరు శంకర్‌యాదవ్ వర్గానికి వ్యతిరేకంగా జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేశారు. శంకర్‌యాదవ్ వర్గీయులు అక్కడికి వెళ్లి స్థానికంగా ఉన్న తాము వేడుకలు నిర్వహించామని, పక్క మండలాల నుంచి వచ్చి వేడుకలు జరుపుతారా అంటూ నిలదీశారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వేడుకలు జరిపితే మర్యాద ఉండదు... ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ కేకు లాక్కున్నారు. ఇలా గంట పాటు మాటల యుద్ధం, ఒకరినొకరు లాక్కోవడం జరిగిపోయాయి. చివరకు వ్యతిరేక వర్గం ప్రతిఘటించడంతో శంకర్వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత కొంత కాలంగా శంకర్‌యాదవ్ వర్గీయులు, వ్యతిరేక వర్గీయుల మధ్య నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాలయ్య జన్మదిన వేడుకల సందర్భంగా విభేదాలు రచ్చకెక్కాయి. చదవండి: (Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్.. ప్రాణాపాయస్థితిలో..) -
విషాదం: బాణసంచా కాల్చడంపై ఘర్షణ.. ఒకరు మృతి
లక్నో: దీపావళి రోజు విషాదం చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. షామ్లీ జిల్లాలో గురువారం దీపావళి రోజు టపాసులు కాల్చడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని రాహుల్, సంజీవ్ సైనీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొదుతూ సంజీవ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. -
కళ్యాణదుర్గంలో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరువర్గాలతో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్,పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి పవన్‌రెడ్డి సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. -
కేరళలో ఘర్షణ: ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎస్డీపీఐ) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలప్పుజ జిల్లాలోని వయలార్ పట్టణంలో ఆర్ఎస్ఎస్, ఎస్డీపీఐ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆర్ఎస్ఎస్కు చెందిన నందు అనే కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన ఎస్డీపీఐ ఆర్గనైజేషన్ విరాళలు సేకరిస్తున్న సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు ఎస్డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బంద్.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి చెందడాన్ని నిరసిస్తూ అలప్పుజ జిల్లాలో గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గోపకుమార్ తెలిపారు. కాజర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వరకు బీజేపీ చేపట్టిన విజయ యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనపై ఎస్డీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. తమ కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ దాడి చేయాలని ముందుగానే ప్రణాళిక వేసుకుందని ఎస్డీపీఐ ఆరోపించింది. అందులో భాగంగానే గురువారం ఎస్డీపీఐ కర్యకర్తలతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారని మండిపడింది. చదవండి: మందేశాడు.. ఎస్సైని ఢీకొట్టాడు -
ఆవు తెచ్చిన తంటా!
పుంగనూరు: ఆవు పొలంలో దూరి పంటను మేసిందని ఇరువర్గాలు ఘర్షణ పడిన సంఘటన గురువారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడి నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు.. భరిణేపల్లెకు చెందిన హేమాద్రి తిరుపతిలో పోలీస్‌గా పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా హేమాద్రి చిన్నాన్న బాలాజి ఆవు తన పొలంలో మేసిందని సాయంత్రం ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీనిపై బాలాజి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పినా హేమాద్రి వినకుండా బాలాజి ఇంటి వద్దకు వెళ్లి అతనిని కొడవలితో నరకడంతో ఎడమచెయ్యి, కాలు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బాలాజి తల్లి మునెమ్మకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ హేమాద్రి మాట్లాడుతూ తనపై బాలాజి, వారి కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు వచ్చి ఆఘర్షణలో బాలాజి గాయపడ్డాడని, తన తల్లినారాయణమ్మను, తనను గాయపరిచారని తెలిపాడు. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఎస్ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గపోరు..
సాక్షి, వరంగల్: జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జాతీయ యువజన కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు బయటపడింది. హన్మకొండ కాంగ్రెస్ భవన్ ముందు తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌రెడ్డి, మరో సీనియర్ నేత కట్ల శ్రీనివాస్ వర్గాల మధ్య మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. -
ఉద్రిక్తంగా మారిన బీజేపీ, కాంగ్రెస్ ర్యాలీలు
పనాజీ: గోవాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాఫెల్‌పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తూ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనాజీలో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అదే సమయంలో ర్యాలీని చేపట్టింది. ఇరువర్గాలు ఎదురుపడటంతో ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. #WATCH Goa: Clash between Congress and BJP workers in Panaji during BJP protest against Congress over Rafale verdict by Supreme Court (21.12.18) pic.twitter.com/E59qbYmQFH — ANI (@ANI) 22 December 2018 -
పెళ్లి బారాత్‌లో ఘర్షణ.. యువకుడు మృతి
సాక్షి, జగిత్యాల : పెళ్లి బారాత్‌లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని బాలాజీ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలివి.. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి వివాదానికి దారి తీసింది. దీంతో వారు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అభి అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడు కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం కిరణ్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాక ఈ దాడికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మత ఘర్షణల్లో ఇద్దరి మృతి
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు 144 సెక్షన్‌ను విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుందన్నారు. తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగిందన్నారు. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయన్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారని వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులోని 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ సహా 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 37 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. -
ఘర్షణకు దారితీసిన పంది వ్యవహారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పంది విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో బుధవారం జరిగింది. పంచాయతీలో మాట్లాడుదామని చెప్పి ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన వారు చితకబాదారు. గ్రామానికి చెందిన సింగబోయిన నాగరాజు మిర్చి తోటలో మేడ కృష్ణకు చెందిన పంది వెళ్లి నాశనం చేసిందని పందిని చంపారు. ఈ విషయమే ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలోఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డుపై గ్యాంగ్‌వార్.. హడలెత్తిన జనం!
-
కాచిగూడలో నడిరోడ్డుపై గ్యాంగ్‌వార్.. హడలెత్తిన జనం!
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు నడిరోడ్డుపై రెండు గ్యాంగ్‌లు తలపడ్డాయి. పరస్పరం గొడవకు దిగి పిడిగుద్దులు విసురుకున్నాయి. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూ రెండు గ్యాంగ్‌లోని సభ్యులు పిచ్చిగా కొట్టుకున్నారు. నగరంలోని కాచిగూడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో నడిరోడ్డుపై ఈ గ్యాంగ్ వార్ తీవ్రస్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను చూసి స్థానికులు, బస్తీవాసులు హడలిపోయారు. ఒక బైక్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. చిన్న గొడవగా మొదలై.. దాడులు, ప్రతి దాడులు, ఇటుకలు, రాళ్లతో కొట్టుకోవడం వరకు వెళ్లిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. నడిరోడ్డుపై ఇంతపెద్ద గొడవ జరిగినా.. పోలీసులు పెట్టీ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ గ్యాంగ్‌వార్‌లో అంబర్‌పేట్‌కు చెందిన ముగ్గురు రౌడీషీటర్లు కూడా ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు పోలీసులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన కాచిగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ బైక్ విషయంలో ఈ గొడవ జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో రౌడీషీటర్లు కూడా ఉన్నారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఘటనలో రౌడీషీటర్లు ఎవరూ లేరని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు తిరిగి రాజీ చేసుకున్నారని, దీంతో పెట్టీ కేసు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ : పూణేలో తాను ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని దళిత నేత, గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మెవాని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తనను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ర్టలో భీమా - కొరేగావ్ ఘటనల నేపథ్యంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 31న జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మెవాని, జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, మహారాష్ర్ట బంద్‌లోనూ పాల్గొనలేదని మెవాని స్పష్టం చేశారు. తనను ఆర్ఎస్ఎస్, బీజేపీలు లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు మహారాష్ర్ట ఘటనలను నిరసిస్తూ దళితులు చేపట్టిన నిరసనలు గుజరాత్, యూపీలనూ తాకాయి. పూణేలో దళిత యువకుడి హత్యను ఖండిస్తూ యూపీలోని ముజఫర్‌నగర్‌లోనూ దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఇద్దరి మృతి
ప్యాపిలి: రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మునిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో నాసిర్ బాషా అనే వ్యక్తి మృతి చెందాడు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని డోన్, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అయితే, ఈ దాడిలోనే తీవ్రంగా గాయపడిన కంబగిరిస్వామి (42) ప్రాణాలు కాపాడుకునేందుకు కనిపించకుండా ఎటో వెళ్లిపోయాడు. అనంతరం ఇంటికి చేరిన ఆయన ఈ మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే గొడవ జరిగినట్టు అనుమానిస్తున్నారు. రెండు వర్గాల ఘర్షణతో మునిమడుగు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి పరిస్థితి అదుపు చేస్తున్నారు.