
సాక్షి, వరంగల్: జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జాతీయ యువజన కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు బయటపడింది. హన్మకొండ కాంగ్రెస్ భవన్ ముందు తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌రెడ్డి, మరో సీనియర్ నేత కట్ల శ్రీనివాస్ వర్గాల మధ్య మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.