
సాక్షి, జగిత్యాల : పెళ్లి బారాత్‌లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని బాలాజీ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలివి.. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి వివాదానికి దారి తీసింది. దీంతో వారు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అభి అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడు కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం కిరణ్‌ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాక ఈ దాడికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment