బాలయ్య జన్మదిన వేడుకల్లో తెలుగు తమ్ముళ్ల రచ్చరచ్చ | Clash Between Two Groups at Balakrishna Birthday Celebrations | Sakshi
Sakshi News home page

బాలయ్య జన్మదిన వేడుకల్లో తెలుగు తమ్ముళ్ల రచ్చరచ్చ

Published Sat, Jun 11 2022 10:33 AM | Last Updated on Sat, Jun 11 2022 12:50 PM

Clash Between Two Groups at Balakrishna Birthday Celebrations - Sakshi

బాలయ్య జన్మదిన వేడుకల్లో గొడవపడుతున్న టీడీపీ వర్గీయులు  

ములకలచెరువు: ములకలచెరువులో సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణ జన్మదిన వేడుకలను రెండు వర్గాలుగా వేర్వేరుగా జరపడం రచ్చకెక్కింది. ముందుగా నియోజకర్గ ఇన్‌చార్జ్‌ శంకర్‌యాదవ్‌ వర్గీయుడు మండల పార్టీ కన్వీనర్‌ పాలగిరి సిద్దా ఆధ్వర్యంలో కేకు కట్‌చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఇంతలో బి.కొత్తకోటకు చెందిన సీనియర్‌ నాయకురాలు పర్వీన్‌తాజ్, పీటీయం మండలానికి చెందిన తలారి మంజునాథ్‌ మరి కొందరు శంకర్‌యాదవ్‌ వర్గానికి వ్యతిరేకంగా జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేశారు. శంకర్‌యాదవ్‌ వర్గీయులు అక్కడికి వెళ్లి స్థానికంగా ఉన్న తాము వేడుకలు నిర్వహించామని, పక్క మండలాల నుంచి వచ్చి వేడుకలు జరుపుతారా అంటూ నిలదీశారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

వేడుకలు జరిపితే మర్యాద ఉండదు... ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ కేకు లాక్కున్నారు. ఇలా గంట పాటు మాటల యుద్ధం, ఒకరినొకరు లాక్కోవడం జరిగిపోయాయి. చివరకు వ్యతిరేక వర్గం ప్రతిఘటించడంతో శంకర్‌వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత కొంత కాలంగా శంకర్‌యాదవ్‌ వర్గీయులు, వ్యతిరేక వర్గీయుల మధ్య నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాలయ్య జన్మదిన వేడుకల సందర్భంగా విభేదాలు రచ్చకెక్కాయి.  

చదవండి: (Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్‌.. ప్రాణాపాయస్థితిలో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement