mulakalacheruvu
-
వ్యక్తి దారుణ హత్య
ములకలచెరువు: ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ములకలచెరువు మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవులచెరువు పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన పసుపులేటి శ్రీనివాసులు(32), భార్య శోభా దంపతులు ములకలచెరువులోని ఒక టమాట మార్కెట్‌యార్డులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వీరికి కుమార్తె వర్షా(17), కుమారుడు మునిచరణ్(5) ఉన్నారు. శనివారం భార్య శోభా తన భర్త తల్లి పసుపులేటి సాలెమ్మతో కలిసి టమాట పొలంలో పనులకు వెళ్లింది. పసుపులేటి శ్రీనివాసులు మాత్రం యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. రోజూ చుట్టు పక్కల కూలీలను ప్రత్యేక వాహనంలో ఇళ్ల వద్ద వదిలేసి వచ్చేవారు. కానీ శ్రీనివాసులు వాహనంలో పోలేదు. ఏమైందో కానీ ఉదయం గోళ్లవారిపల్లె సమీపంలోని పొలాల్లో శవమై కనిపించాడు. అటువైపు వెళ్లే ప్రయాణికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. మదనపల్లి డీఎస్పీ రవిమనోహరచారి, సీఐ శివాంజనేయులు, ఎస్ఐ డీవై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై రాయితో మోదడంతో ప్రాణాలు కోల్పోయి నుజ్జునుజ్జుగా మారి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మార్కెట్లో తనతో పాటు పని చేసే వేణుగోపాల్, శంకరపైన అనుమానం ఉన్నట్లు తల్లి సాలెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రెచ్చిపోయిన ఆకతాయిలు
ములకలచెరువు: స్థానిక కదిరి రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ వద్ద ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కళాశాల, పాఠశాలకు వచ్చి వెళ్లే బాలికలను వారు వేధింపులకు గురి చేస్తున్నారు. విసిగి వేసారిన బాలికలు కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం బాలికలు ఇంటికి వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు కళాశాల వద్దకు వెళ్లారు. వారి ఎదుటే బాలికలను వేధిస్తుండటంతో.. ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. రెచ్చిపోయిన వారు బాలికల కుటుంబ సభ్యుల మీద ఎదురు తిరిగారు. చుట్టు పక్కల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. దీంతో అక్కడే ద్విచక్రవాహనాలు వదిలేసి వారు పారిపోయారు. పోలీసులు చొరవ తీసుకొని ఆకతాయిల ఆటకట్టించాలని బాలికల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు. -
బాలయ్య జన్మదిన వేడుకల్లో తెలుగు తమ్ముళ్ల రచ్చరచ్చ
ములకలచెరువు: ములకలచెరువులో సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణ జన్మదిన వేడుకలను రెండు వర్గాలుగా వేర్వేరుగా జరపడం రచ్చకెక్కింది. ముందుగా నియోజకర్గ ఇన్చార్జ్ శంకర్‌యాదవ్ వర్గీయుడు మండల పార్టీ కన్వీనర్ పాలగిరి సిద్దా ఆధ్వర్యంలో కేకు కట్‌చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇంతలో బి.కొత్తకోటకు చెందిన సీనియర్ నాయకురాలు పర్వీన్‌తాజ్, పీటీయం మండలానికి చెందిన తలారి మంజునాథ్ మరి కొందరు శంకర్‌యాదవ్ వర్గానికి వ్యతిరేకంగా జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేశారు. శంకర్‌యాదవ్ వర్గీయులు అక్కడికి వెళ్లి స్థానికంగా ఉన్న తాము వేడుకలు నిర్వహించామని, పక్క మండలాల నుంచి వచ్చి వేడుకలు జరుపుతారా అంటూ నిలదీశారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వేడుకలు జరిపితే మర్యాద ఉండదు... ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ కేకు లాక్కున్నారు. ఇలా గంట పాటు మాటల యుద్ధం, ఒకరినొకరు లాక్కోవడం జరిగిపోయాయి. చివరకు వ్యతిరేక వర్గం ప్రతిఘటించడంతో శంకర్వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత కొంత కాలంగా శంకర్‌యాదవ్ వర్గీయులు, వ్యతిరేక వర్గీయుల మధ్య నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాలయ్య జన్మదిన వేడుకల సందర్భంగా విభేదాలు రచ్చకెక్కాయి. చదవండి: (Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్.. ప్రాణాపాయస్థితిలో..) -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
ములకలచెరువు: అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రం మండలం పులికల్లుకు చెందిన తలారి శివక్రిష్ణకు అనంతపురం జిల్లా కుటాగులకు చెందిన కె.గంగరాజు కుమార్తె గాయత్రి(26)తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. కొన్ని నెలలుగా అత్త నారాయణమ్మ, మామ వేణుగోపాల్, భర్త శివక్రిష్ణ వేధింపులకు గురి చేస్తున్నారు. పొలం వద్దకు వెళ్లి రాత్రి పూట కాపలా ఉండాలని, ఇంట్లో ప్రతి పనికి దూషిస్తుంటారని కుమార్తె తమకు చెప్పుకొని కుంగిపోయేదని గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శివక్రిష్ణ తాగుడుకు బానిస అయ్యాడని, తరచూ ఇంట్లో గొడవలు జరిగేవని చెప్పారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైంది. భర్త గమనించి వాహనంలో ములకలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనతో బెంగళూరుకు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గురువారం రాత్రి పొలం వద్దకు తీసుకొచ్చారు. గంగరాజు ఫిర్యాదుతో వేధింపులు, గృహ హింస చట్టం కింద అత్త, మామ, భర్తపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామక్రిష్ణ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కడుపునొప్పితో.. ఓబులవారిపల్లె : కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లంపేట మండలం బోటీమీదపల్లెలోని ఎన్టీ కాలనీకి చెందిన కానూరు రమాదేవి(25)కి అదే గ్రామానికి చెందిన శ్యామా అనే వ్యక్తితో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల సాయికుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరూ మండలంలోని ముక్కావారిపల్లె ముక్కా విరుపాక్షరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కాపలా దారులుగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం కడుపు నొప్పి తాళలేక గడ్డి మందు తాగింది. వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
భారీగా తగ్గిన టమాటా ధర.. కిలో రూ.20 మాత్రమే, ఎక్కడంటే?
ములకలచెరువు (చిత్తూరు జిల్లా): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన టమాటా ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. 30 కిలోల బాక్సు రూ.600 పలికింది. రెండు రోజుల క్రితం వరకు అదే బాక్సు ధర రూ.3 వేలు దాటింది. బయటి రాష్ట్రాల నుంచి పలువురు వ్యాపారులు ఇక్కడికి టమాటాలను తెప్పించడంతోనే ధరలు తగ్గాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఠారెత్తిస్తున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. అవసరమైతే మిగిలిన జిల్లాల్లోనూ విక్రయాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. (చదవండి: విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి..) -
అధికారులే.. టార్గెట్
బి.కొత్తకోట: ములకలచెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని ఈనెల 8న స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ముట్టడించి తాళాలు వేసిన ఘటనలో అధికారులే బలి పశువులు అవుతున్నారు. తహసీల్దార్ ఇచ్చిన పోలీసు ఫిర్యాదు నమోదైతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తామని మండల నేతలు మంత్రి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌కు అల్టిమేటమ్ ఇవ్వడమే ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది. శనివారం డిప్యూటీ తహసీల్దార్ నిర్మలాదేవిని ఉన్నతాధికారులు చిత్తూరుకు బదిలీ చేయగా తహసీల్దార్ అమరేంద్రబాబు సోమవారం నుంచి 15 రోజులు సెలవులో వెళ్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. వివరాల్లోకి వెళితే.. తహసీల్దార్ అమరేంద్రబాబు సమస్యలను పరిష్కరించడం లేదంటూ 8వ తేదీన మండలానికి చెందిన టీడీపీ నాయకులు, తహసీల్దార్ కార్యాలయానికి తాళంవేశారు. దీంతో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ, సిబ్బంది కార్యాలయంలోనే సాయంత్రం ఉండిపోయారు. ఆ మరుసటి రోజు మళ్లీ ఆందోళన నిర్వహించారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయడం కోసం నాయకులు ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి చిత్తూరు వెళ్లి కలెక్టర్‌ను కలిసినా సానుకూల స్పందనరాలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగిన నాయకులు కేసు నమోదు చేస్తే మూకుమ్మడిగా పార్టీకి రాజీనా మాలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి అమరనా«థ్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌కు తేల్చిచెప్పడంతో కేసు నమోదు పెండింగ్‌లో పడిందని తెలిసింది. ఇంతలో జిల్లా అధికారులు శనివారం డిప్యూటీ తహసీల్దార్ నిర్మలాదేవిని చిత్తూరుకు బదిలీ చేశారు. ఆమె బదిలీ అయిన మరుసటి రోజు ఆదివారం తహసీల్దార్ అమరేంద్రబాబు సుదీర్ఘ సెలవులోకి వెళ్లడం చర్చ నీయాశమైంది. కాగా గురువారం రోజే అమరేంద్రబాబును జిల్లా అధికారులు చిత్తూరుకు పిలి పించుకొని వివరాలు సేకరించారు. దీంతో ఆయన ఈనెల 15 నుంచి వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని భావిస్తున్నారు. పంతం నెగ్గుతుందా? మండలానికి చెందిన కొందరు టీడీపీ నేతలు తహసీల్దార్‌ను బదిలీ చేయించి ఆయన స్థానంలో ఇటీవల డీటీగా వచ్చిన నిర్మలాదేవిని ఇన్చార్జిగా నియమించుకోవాలని యత్నించినట్టు తెలిసింది. అది సాధ్యం కాకపోవడంతో ఆందోళనకు దిగారు. అయితే కేసు నమోదు వరకు పరిస్థితి వెళ్లడంతో రాజకీయ వివాదం నెలకొంది. ఇదిలా ఉండగా బదిలీ అయిన నిర్మలాదేవి స్థానంలో కొత్త డీటీగా వచ్చిన వెంకటరెడ్డి సెలవురోజైనా.. ఆదివారమే ఆVýæమేఘాలపై బాధ్యతలు చేపట్టడం కొసమెరుపు. -
అప్పులు చెల్లించలేక రైతు ఆత్మహత్య
నగలు అమ్మి వడ్డీ చెల్లింపు భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తంబళ్లపల్లె: అప్పుల బాధ తాళలేక చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో ఆదివారం ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని దేవరపల్లెకు చెందిన వి.కృష్ణప్ప(47)కు మూడెకరాల పొలం ఉంది. భార్య మల్లమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లల్ని బురకాయల కోటలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. కృష్ణప్ప ఏడాదిన్నర క్రితం నలుగురు ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.నూటికి పది రూపాయల వడ్డీకి రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఈ మొత్తంతో టమాట పంట వేశాడు. అప్పట్లో ధర పతనమవడంతో పెట్టుబడి సైతం చేతికి అందక తీవ్రంగా నష్టపోయాడు. చేసేది లేక వ్యవసాయాన్ని పక్కనబెట్టి ఐదు నెలలుగా భార్యతో కలిసి బురకాయలకోటలోని ఓ ప్రైవేటు నర్సరీలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రుణదాతలు అప్పు చెల్లించమని ఒత్తిడి చేయడంతో శనివారం భార్య నగలు అమ్మి రూ.లక్ష వడ్డీ చెల్లించాడు. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ రాత్రి మల్లమ్మ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణప్ప నర్సరీ వెనుక వైపునకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఈశ్వరయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను మరొకరితో ఉండటం చూసి..
-
భార్య మరొకరితో ఉండటం చూసి..
ములకలచెరువు (చిత్తూరు) : భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతుందని తెలుసుకున్న భర్త గత కొన్ని రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి కోపోద్రిక్తుడై వేటకొడవలితో ఇద్దిరినీ నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కదిరినాయినికోట గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతులు వెంకటరమణ, అరుణ(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఆదినారాయణ(39) కూడా కూలి పనులకు వెళ్తుంటాడు. ఈక్రమంలో ఆదినారాయణ అరుణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన వెంకటరమణ పలుమార్లు భార్యను హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో.. మనస్తాపానికి గురై తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు. కాగా ఆదివారం ఉదయం భర్త ఇంట్లో లేని విషయాన్ని గుర్తించిన అరుణ ఆదినారాయణను కలవడానికి వెళ్లింది. ఇది తెలుసుకున్న వెంకటరమణ వేట కొడవలిని వెంట తీసుకొని వాళ్లను అనుసరిస్తూ వెళ్లాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వేట కొడవలితో ఆమె మెడ మీద వేటు వేయడంతో.. అరుణ అక్కడికక్కడే మృతిచెందగా, అక్కడి నుంచి పారిపోయిన ఆదినారాయణను వెంటాడి నడి రోడ్డుపై నరికి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజిన్ ఫెయిలై నిలిచిన రైలు
ములకలచెరువు (చిత్తూరు) : ప్యాసింజర్ రైలు ఇంజిన్ లోపంతో గంటలపాటు నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకు రైలు తిరిగి కదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు ఇంజిన్‌లో లోపంతో ములకలచెరువు మండలం బత్తలాపురం వద్ద నిలిచిపోయింది. అయితే అదే మార్గంలో రావాల్సిన తిరుపతి- గుంతకల్లు రైలును తుమ్మనగుట్ట వద్ద ఆపేశారు. ఆ ఇంజిన్‌ను బత్తలాపురం వద్దకు తీసుకెళ్లి అక్కడ నిలిచిన రైలు బోగీలను బత్తలాపురం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం రైలు గుంతకల్లు వైపు వెళ్లిపోయింది. కాగా తిరుపతి రైలు అక్కడే ఉంది. హిందూపురం నుంచి మరో ఇంజిన్‌ను తెప్పించి నిలిచిపోయిన రైలును సాయంత్రం 5 గంటల సమయంలో గమ్యస్థానం వైపు నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రయాణికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. -
విరబూసిన బ్రహ్మకమలాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోట, ములకలచెరువు మండలాల్లో మంగళవారం రాత్రి బ్రహ్మకమలాలు విరగబూశాయి. ఒక్కో మొక్కలో 50 నుంచి 120 పూవ్వులు పూశాయి. వీటీని తిలకించేందుకు స్థానికులు తండోపతండాలుగా తరలివస్తుండటం విశేషం. ములకలచెరువు మండలం బురకాయలకోటలోని పూల సరోజమ్మ ఇంటి పెరట్లో నాలుగేళ్ల క్రితం మొక్కను నాటింది. ఇప్పటివరకు ఏనాడూ పూయని విధంగా మంగళవారం రాత్రి 10 గంటల సమయం తర్వాత 150 పువ్వులు విరబూశాయి. వీటిని తిలకించేందుకు స్థానికులు ఎగబడ్డారు. కొందరు పూలను కొసుకెళ్లారు. బి.కొత్తకోట పాశంవీధిలోని గంజిమోహన ఇంటి పెరట్లోని మొక్కకు రాత్రి 9.30గంటల సమయంలో 51 బ్రహ్మకమలాలు విరబూశాయి. దీన్ని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. పిల్లలు, మహిళలు ఫోటోలు తీసుకొన్నారు.